అవినాశ్ రెడ్డికి అవమానం, చెప్పలేవా: బాబు ఫ్యామిలీ అంటూ బొత్స, దుర్గగుడి తాంత్రిక పూజపై

Posted By:
Subscribe to Oneindia Telugu
  అవినాశ్ రెడ్డి మైక్ లాక్కున్న టీడీపీ !

  అమరావతి: పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. ఆయన తీరు బాధాకరం అన్నారు. ప్రభుత్వ సభల్లోకి రౌడీషీటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. సభలో దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు.

  జగన్ ఇలాకాలో షాక్: గో బ్యాక్, మైక్ లాక్కున్నారు, వెళ్లిపోయిన అవినాశ్, బాబు రాకముందే కలకలం

  జన్మభూమి సభలు టీడీపీ సభలుగా మారిపోయాయని ఆరోపించారు. అధికార సభలకు వచ్చే హక్కు ప్రజాప్రతినిధులకు ఉంటుందని చెప్పారు. సభలో ఎంపీకే అలాంటి చేదు అనుభవం ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

  అవినాశ్ రెడ్డికి అవమానం జరిగింది

  అవినాశ్ రెడ్డికి అవమానం జరిగింది

  తమ పార్టీ ఎంపి అవినాశ్ రెడ్డికి పులివెందుల సభలో అవమానం జరిగిందన్నారు. అవినాశ్‌ను అడ్డుకోవడం, ఆయన మైక్ లాక్కునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గండికోట నీరుపై ఎంపీ.. చంద్రబాబును ప్రశ్నించారన్నారు. ఎంపీ ఏమైనా తప్పు మాట్లాడారా అన్నారు. సీఎం సభా వేదిక పైకి రౌడీషీటర్లు ఎలా వచ్చారన్నారు.

   అవినాశ్ చెప్పేది వినే ఓపిక లేదా

  అవినాశ్ చెప్పేది వినే ఓపిక లేదా

  ఎంపీ అవినాశ్ రెడ్డి చెప్పేది వినే ఓపిక చంద్రబాబుకు లేదా అని బొత్స ప్రశ్నించారు. అవినాశ్ చేతి నుంచి సీఎం చంద్రబాబు మైక్ లాక్కోవడం దారుణం అన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏదో వివాదం ఉంటుందని విమర్శించారు.

   దుర్గ గుడి తాంత్రిక పూజలపై సీఎం ఫ్యామిలీపై అపవాదు

  దుర్గ గుడి తాంత్రిక పూజలపై సీఎం ఫ్యామిలీపై అపవాదు

  బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలపై బొత్స తీవ్రంగా స్పందించారు. కనకదుర్గమ్మపై భక్తులకు ఎంతో నమ్మకం అని, ఇది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు బాధాకరమన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. సాక్షాత్తు సీఎం కుటుంబం పైనే అపవాదులు వచ్చాయన్నారు.

   చంద్రబాబు అడ్డుకున్నారంటూ

  చంద్రబాబు అడ్డుకున్నారంటూ

  కాగా, అవినాశ్ రెడ్డి ప్రసంగంపై చంద్రబాబు బుధవారం సభలో అభ్యంతరం తెలపడంపై జగన్ పత్రిక సాక్షిలోను కథనం వచ్చింది. 'ఏయ్ తప్పుడూ.. మాట్లాడొద్దు, ఏం మాట్లాడుతున్నావ్, ఎవరయ్యా అక్కడ, మైక్ కట్ చేయండి, మైక్ ఇలా ఇవ్వు' అని బాబు వ్యాఖ్యానించిన విషయాన్ని పేర్కొంది.

  వైయస్ అవినాశ్ రెడ్డికి మద్దతుగా సభలో కొందరు ఈలలు, చప్పట్లు కొట్టడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారని, అందుకే మైక్ కట్ చేయమన్నారని పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party leader Botsa Satyanarayana on Thursday questioned that why Chandrababu naidu not answered to MP Avinash Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి