పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు జగన్ వ్యూహం, 'జనసేన'పై ప్రశాంత్ కిషోర్ ఆరా

Posted By:
Subscribe to Oneindia Telugu
  Pawan Kalyan targeted By This Politician పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు వ్యూహం | Oneindia Telugu

  అమరావతి: టిడిపి తీరు చూస్తుంటే అప్పుడే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర టిడిపి నేతలు ఇంటింటికి టిడిపి పేరుతో దూసుకెళ్తున్నారు.

  ఎన్నికలు మరెంతో దూరంలో లేవన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.

  జనసేన బలంపై ఆరా

  జనసేన బలంపై ఆరా

  ఇదిలా ఉండగా, వరుస ఓటముల అనంతరం వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సర్వేలతో రంగంలోకి దిగారని తెలుస్తోంది. అంతేకాదు, ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో జనసేన ప్రభావంపైనా ఆయన ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలో ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

  పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు కానీ

  పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు కానీ

  జనసేన పార్టీ ఇంకా పూర్తిగా సంస్థాగతంగా నిర్మాణం కాలేదు. త్వరలో పవన్ పాదయాత్ర లేదా ఇతర మార్గాల ద్వారా పార్టీని బలోపేతం చేయనున్నారు. అయితే ప్రస్తుతం జనసేన బలం ఎంతుంది, ఓట్లు ఎలా చీలుతాయి అనే అంశంపై ఓ క్లారిటీ రావడానికి వైసిపి జనసేన బలంపై ఆరా తీస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి.

  పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు

  పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు

  నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరికీ మద్దతివ్వలేదు. కానీ లోపాయికారిగా జనసేన టిడిపికి మద్దతిచ్చినట్లుగా వైసిపి భావిస్తోంది. 2019లో టిడిపి - జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితులు ఉంటే పవన్ కళ్యాణ్‌ను ఎలా దెబ్బతీయాలు, విడిగా పోటీ చేస్తే ఏం చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చేందుకు జనసేనపై ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక దృష్టి సారించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

  వ్యూహంతో ప్రశాంత్ - జగన్ కిషోర్ జోడి

  వ్యూహంతో ప్రశాంత్ - జగన్ కిషోర్ జోడి

  పవన్ కళ్యాణ్ పైన ఇటీవల సినీ ప్రముఖుడు కత్తి మహేష్ అంతగా రెచ్చిపోవడానికి వెనుక వైసిపి ఉన్నదనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచే పవన్ పైన జగన్ - ప్రశాంత్ కిషోర్‌ల జోడీ ఓ వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోందని తెలుస్తోంది. పవన్ ఆరంభానికి ముందే ఆయనను దెబ్బతీసేలా ప్లాన్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

  పవన్ కళ్యాణ్‌పై ప్రత్యేక దృష్టి ఎందుకు?

  పవన్ కళ్యాణ్‌పై ప్రత్యేక దృష్టి ఎందుకు?

  వైసిపి దృష్టి పవన్ కళ్యాణ్ పైన ప్రధానంగా ఉండటానికి ఓ కారణం ఉంది. ఆయన కులమతాలు పట్టించుకోరు. కాపుల విషయంలో ఇతర పార్టీలకు ఆయన ఓటు బ్యాంకు. 2014లో ఆయన మద్దతు వల్ల కాపులు అధికంగా టిడిపి-బిజెపికి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్ నేపథ్యంలో కాపులు ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఈ కారణంగానే వారు జనసేనానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక, యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

  అందరూ సిద్ధమే.. కానీ ఇప్పుడు జగన్

  అందరూ సిద్ధమే.. కానీ ఇప్పుడు జగన్

  ఓ సందర్భంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనట్లుగా మాట్లాడారు. అప్పుడే పవన్ కళ్యాణ్ సై అన్నారు. జగన్ కూడా ఉవ్వీళ్లూరుతున్నారు. కానీ నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి అధినేత ఆలోచన ఎలా ఉందో తెలియదు. ఆయన లండన్ పర్యటన ముగిసిన తర్వాత, లేదా జనాల్లోకి వచ్చిన తర్వాతనే ఆయన ఆలోచన తెలుస్తుందని అంటున్నారు.

  జగన్ వ్యాఖ్యల్లోను ఎన్నికల ఉత్సాహం

  జగన్ వ్యాఖ్యల్లోను ఎన్నికల ఉత్సాహం

  అదే సమయంలో జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడని కొట్టి పారేయలేమని అంటున్నారు. నంద్యాల ఫలితాల తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఒక్కటి కాబట్టి అధికార పార్టీ గెలిచిందని, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి సత్తా తెలుస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే ఆయన కూడా ఎన్నికలకు సిద్ధంగా లేడని చెప్పలేమని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy and elections strategist Prashanth Kishore are targetting Jana Sena chief Pawan Kalyan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి