సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై రోజుకో తీరుగా విరుచుకుపడుతోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు భాషను సైతం మార్చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులను 'ఏంట్రా' అంటూ దూషణలకు దిగారు. ఏపీలో గ్రామ వాలంటీర్లకు సన్మానం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు.. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులకు తార్కాణంగా నిలిచాయన్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలపైనా రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రచ్చబండ పేరుతో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

సన్మానాలకు రూ.261 కోట్లా?
''అసలే అప్పుల్లో కూరుకుపోయిన ఏపీలో అత్యంత చీప్ డ్రామాలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ.261 కోట్లు తగలేశారు. ఓవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఇలాంటి పనికిమాలిన పనులకోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణం. పెన్షన్ డబ్బులు అకౌంట్లలో వేసి, రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తే పోయేదానికి అనవసరంగా ఓ వ్యవస్థను పెట్టి, దాన్ని చూసి దేశమంతా గర్విస్తోందని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు. వాలంటీర్ వ్యస్థను విస్త్రను చేసి వైసీపీ వాళ్లు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు..

ఏట్రా ఇది? ఎవడబ్బ సొమ్మురా?
వాలంటీర్లకు సన్మాన సభలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వాలంటీర్లను జగనన్న సైన్యాలని అభివర్ణించాడు. అదేంట్రా? ఎవడబ్బ సొమ్ముతో వాలంటీర్లకు జీతాలిస్తున్నారు? ప్రజాధనంతో, ప్రభుత్వ సొమ్ముతో పనిచేసే వాలంటీర్లు జగనన్న సైన్యం ఎలా అవుతార్రా? అసలు సైన్యమంటే ఎవరు? రాజుగారి రాజ్యకాంక్షను తీర్చే బలగాలేకదా? మరి ఏపీలోని వాలంటీర్లు కూడా జగన్ రాజ్యకాంక్షను తీర్చేవాళ్లలాగానే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది కదా, అలాంటప్పుడు వాళ్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడమేంటి? అంతగా సైన్యం కావాలనుకుంటే వైసీపీ పార్టీ నుంచే డబ్బులు ఇచ్చి పెట్టించుకోవచ్చుకదా? ప్రజా ధనంతో మేం పార్టీ సైన్యాలను నడుపుతున్నాం అని ఇప్పటికైనా బాహాటంగా ఒప్పుకున్నారుగా..

మాస్కు జనాలకేనా? జగన్‌కు వద్దా?
ఏపీలో మాస్కులు ధరించని జనాలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. మరి ఇవాళ వాలంటీర్ల సన్మాన సభలో సీఎం జగన్, ఆయన పక్కనున్న ఇద్దరు మంత్రులు మాస్కులు పెట్టుకున్నారా? వాళ్ల నుంచి రూ.3వేలు వసూలు చేయాల్సిందే కదా. కరోనా వ్యాప్తి సాకుతో జగన్ తన తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. మరి ఇవాళ్టి సభకు జనం నిండుగా హాజరయ్యారు, సగానికిపైగా మందికి మాస్కులే లేవు. మాస్కులు లేకుంటే జనాన్ని కొట్టి చంపుతారా? అదే మీరు మాత్రం నిస్సిగ్గుగ్గా వ్యవహరిస్తారా? ఇదెక్కడి న్యాయం. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, పొరుగున తెలంగాణలో...

కేసీఆర్ దెబ్బకు రాయలసీమ ఎడారే
ఏపీ సీఎం జగన్ అప్పులు చేసి వాలంటీర్లకు సన్మానాల వంటి పనికిమాలిన పనులు చేస్తుంటే, అవతల తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులు, మంత్రుల్ని పెట్టి కృష్ణా జలాలను వాడేసుకునే పనిలో బిజీ అయిపోయారు. బచావత్ అవార్డు, కృష్ణా రివర్ బోర్డు కేటాయింపులకు మించి, మిగులు జాలాల ఆధారంగా తెలంగాణలో కొత్త ప్రాజెక్టులను కట్టుకుంటున్నారు. అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారడం ఖాయం. కేసీఆర్ తో హార్ధిక సంబంధాలున్న జగన్ ఏం చేస్తున్నట్లు? సీమ ప్రజలకు నీళ్లిస్తానన్న వాగ్ధానం ఏమైనట్లు? ఎంత సేపూ ఢిల్లీకి పోతే రఘురామ మీద ఫిర్యాదులో, సొంత పనులో కాకుండా కృష్ణా జలాలపైనా మాట్లాడండి, మీకు చేతకాకపోతే కనీసం నిష్ణాతులను పెట్టుకుకోండి, తెలంగాణ నిర్మిస్తోన్న కొత్త ప్రాజెక్టులను అడ్డుకోండి. ఏపీలో అన్న జగన్ చేతులు ముడుచుకుని కూర్చుంటే తెలంగాణలో చెల్లెల్లు షర్మిల మాత్రం..

సీమకు నీళ్లివ్వనని షర్మిల శపథం
పుట్టింటోళ్లు తరిమేస్తేనో, మరో కారణం చేతనో జగన్ సోదరి వైఎస్ షర్మిల తన అత్తగారింటి కోసం పని చేయాలని ఫిక్స్ అయ్యారు. నీటా వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగనీయనని అంటోన్న షర్మిల.. రాయలసీమకు చుక్క నీరు కూడా రానీయబోనని శపథాలు చేస్తున్నారు. ఏపీ రాజన్న రాజ్యంలో సీమకు నీరివ్వడం ప్రధాన అంశమైతే, తెలంగాణ రాజన్న రాజ్యంలో మాత్రం అదే సీమకు నీళ్లను అడ్డుకోవడం విధానంగా ఉన్నట్లుంది. పైపెచ్చు, షర్మిల పార్టీతో సంబంధం లేదని జగన్ సలహాదారులు ప్రకటిస్తుంటే, అదే జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలైన వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి ఆశీర్వచనాలు ఇస్తారు. త్వరలో పెట్టబోయే షర్మిల పార్టీకి కూడా విజయమ్మే వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉంటారా? ఒక వ్యక్తి రెండు పార్టీలకు ఆ పదవుల్లో ఉండొచ్చా?, అసలీ రాజన్న రాజ్యాల డ్రామాలేంటో అర్థం కావట్లేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications