షాకింగ్ : భాగస్వామి కోసం స్వలింగ సంపర్కుడి ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్టంలో దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన చోటు చేసుకుంది. నానో టెక్నాలజీ పరిశోధక విద్యార్థి భోపాల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ సంపన్న కుటుంబానికి చెందిన 27 ఏళ్ల యువకుడు.

అతనికి ఎక్కడలేని దైవభక్తి. తన మానాన తానుండే అతను అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అందుకు గల కారణం తెలిసి దిగ్భ్రాంతికి గురి కాక తప్పలేదు.

తల్లిదండ్రులకు తెలియదు

తల్లిదండ్రులకు తెలియదు

పిహెచ్‌డి విద్యార్థి నీలోత్పల్ సర్కార్ గే. తండ్రి హరిద్వార్‌లోని బిహెచ్ఈఎల్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి డాక్టర్. అయితే, తమ కుమారుడు స్వలింగ సంపర్కుడనే విషయం తల్లిదండ్రులకు తెలియదు.

ఇదే చివరి సందేశమని పోస్టు

ఇదే చివరి సందేశమని పోస్టు

ఇదే నా చివరి సందేశం అంటూ ఇీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ వీడియో చోటు చేసుకుంది. అతని గది గోడలపై రాతలతో పాటు పలు లేఖలు అదులో ఉన్నాయి. 2016లో దీపావళి రోజు కాళీమాత కలలో ప్రత్యక్షమైందని, శాశ్వత ఆనందం గురించి చెప్పందని అందులో అన్నాడు.

 కల గురించి బయటకు చెప్తే..

కల గురించి బయటకు చెప్తే..

ఈ కల గురించి బయటికి చెప్తే అేద తన చివరిరోజు అవుతుందని ఇప్పటి దాకా చెప్పలేదని, తాను ఇష్టపడిన వ్యక్తి తన జీవితంలోకి వస్తే అదే తనకు శాశ్వత ఆనందమని, తనతో అతను లైంగిక సుఖం పొందకపోవచ్చునని, అయితే తామిద్దరం సంతోషంగా ఉండేందుకు అవసరమైనవి అన్నీ చేయగలమని అతను రాశాడు.

 ఇంకా ఇలా రాశాడు

ఇంకా ఇలా రాశాడు

తాను ప్రపోజ్ చేసిన రోజే తన జీవితం ముగుస్తుందని, తానెవరో తెలిసేటప్పటికి అతను చనిపోతాడని, అతడు ఎవరైనప్పటికీ అతడికి ఏ విధమైన హాని జరగకూడదని తాను కాళీ మాతను వేడుకున్నానని, దానికి పరిష్కారం తాము పెళ్లి చేసుకోవడమేనని, అయితే మీరు జీవితంలో కలుసుకోగలరు గానీ పెళ్లి మాత్రం వచ్చే జన్మలో జరుగుతుందని అమ్మవారు చెప్పింందని అతను రాశాడు.

 ఫోన్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు

ఫోన్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు

ఫేస్‌బుక్ ద్వారా విషయం తెలుసుకున్న తల్లి అతడికి ఫోన్ చేసింది. అయితే ఫలితం లేకుండా పోయింది ఇంటి వద్ద తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడని, త్వరగా ఇంటికి వచ్చేయాలని తల్లి ఫేస్‌బుక్ ద్వారా కోరింది.

 అయితే అప్పటికే అతను...

అయితే అప్పటికే అతను...

గది యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితో అప్పటికే నీలోత్పల్ భోపాల్‌లోని అప్పర్ లేక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతడి మృతదేహంలో లేక్‌లో తేలుతూ కనిపించింది. తనను త్వరగా గుర్తు పట్టే విధంగా అతను తన పేరు, చిరునామలతో ఓ ట్యాగ్ రాసుకుని చేతి మణికట్టుకు కట్టుకున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizarre and shocking incident, a nanotechnology researcher from Bhopal ended his life by jumping into the Upper Lake Bhopal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి