చీకటి పడ్డాక ఎండ కావాలా? అయితే రూ. 5 లక్షలు కట్టాల్సిందే!
ప్రకృతి ప్రసాదించిన గాలిని ఇప్పటికే బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారు.. తాగే నీటిని క్యాన్లలో నింపి వ్యాపారం చేస్తున్నారు.. ఇక ఇప్పుడు వంతు సూర్యుడిది! అవును, మీరు విన్నది నిజమే. రేపటి రోజున సూర్యరశ్మి కూడా ఉచితం కాదు. రాత్రి పూట మీకు సూర్యకాంతి కావాలంటే గంటకు రూ. 5 లక్షలు (సుమారు 6,000 డాలర్లు) చెల్లించాల్సిందే. అమెరికాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' (Reflect Orbital) అనే స్టార్టప్ కంపెనీ 'సూర్యకాంతిని అమ్ముతాం' అంటూ ప్రకటించి ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది.
చీకటి పడ్డాక సూర్యుడు కనిపించడు కదా.. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే అసలు సిసలైన టెక్నాలజీ ఉంది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు (Satellites) భారీ పరిమాణంలో ఉండే అల్ట్రా-రిఫ్లెక్టివ్ అద్దాలను అమరుస్తారు. సూర్యుడు భూమికి అవతలి వైపు ఉన్నప్పుడు, ఈ అద్దాలు సూర్యకాంతిని పరావర్తనం చెందించి (Reflect), సరిగ్గా మీరు కోరుకున్న ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశంపైకి మళ్లిస్తాయి. అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వారికి రాత్రి పూట కూడా పగటి వెలుగు కనిపిస్తుంది. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కధలా ఉన్నా, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ దీనిని సాకారం చేస్తోంది.

Sunlight ఎందుకు కొనాలి?
కేవలం సరదా కోసం వెలుగును కొనడం కాదు.. దీని వెనుక పెద్ద బిజినెస్ ప్లానే ఉంది.
- సోలార్ పవర్: ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్ కేవలం పగలు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ టెక్నాలజీతో రాత్రి కూడా ఎండను సృష్టించి 24 గంటలు కరెంటును తయారు చేయవచ్చు.
- భారీ ఈవెంట్స్: రాత్రి పూట జరిగే ఖరీదైన అవుట్‌డోర్ పార్టీలు, షూటింగ్‌లు లేదా స్టేడియాల్లో లైటింగ్ కోసం లక్షల రూపాయల కరెంటు ఖర్చవుతుంది. దానికి బదులు ఈ 'నేచురల్ సన్‌లైట్'ను అద్దెకు తీసుకోవచ్చు.
- విపత్తుల వేళ: భూకంపాలు లేదా వరదలు వచ్చినప్పుడు రాత్రి పూట సహాయక చర్యలు చేపట్టడానికి ఈ వెలుగు ప్రాణవాయువులా మారుతుంది.
ప్రకృతికి ముప్పు తప్పదా?
అయితే, ఈ ప్రయోగంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. రాత్రి పూట కృత్రిమంగా వెలుగును సృష్టించడం వల్ల పక్షులు, జంతువుల జీవ గడియారం (Circadian Rhythm) అస్తవ్యస్తమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ 'అద్దాల వెలుగు' పెద్ద అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతిని వ్యాపారమయం చేయడంపై విమర్శలు ఉన్నప్పటికీ, సూర్యరశ్మిని కూడా 'ఆన్-డిమాండ్' సర్వీస్‌గా మార్చాలనే ఈ వింత ఐడియా ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications