Delta Plus: దక్షిణ భారతదేశంలో తమిళనాడులో భోణి, ఒకరి బలి, ఆంధ్రా, పొరుగు రాష్ట్రాల్లో!
చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో సామాన్య ప్రజలు కొంచెం కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ దెబ్బతో ప్రజల మీద పిడుగుపడినట్లు అయ్యింది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో డెల్టా ప్లస్ వేరియంట్ దెబ్బతో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఇద్దరు డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాధితో బాధపడుతూ కోలుకుంటున్నారని తమిళనాడు వైద్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రి మా సుబ్రమణియన్ అంటున్నారు. తమిళనాడులో డెల్టా ప్లస్ వేరియంట్ దెబ్బకు ఒకరి ప్రాణం పోవడంతో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Recommended Video

తమిళనాడులో కలకలం
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరువాత తమిళనాడులో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మొదటి మరణం నమోదు కావడం కలకలం రేపింది. మదురైలోని ఓ వ్యక్తి డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా చికిత్స విఫలమై మరణించాడని తమిళనాడు వైద్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రి మా సుబ్రమణియన్ స్పష్టం చేశారని పీటీఐ వార్త సంస్థ తెలిపింది.

చెన్నై నర్సుకు డెల్టా ప్లస్ అంటుకుంది
తమిళనాడులో మదురైలోని ఓ వ్యక్తి డైల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన తరువాత తాము అప్రమత్తమై ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేస్తున్నామని తమిళనాడు మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు. చెన్నైలోని 32 ఏళ్ల వయసు ఉన్న నర్సుతో పాటు కాంచీపురం జిల్లాకు చెందిన మరో వ్యక్తికి డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాధి సోకిందని, ఇద్దరికి మెరుగైన చికిత్స అందించడానికి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మా సుబ్రమణియన్ చెప్పారు.

డెల్టా ప్లస్ దెబ్బతో హడల్
శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 45,000 వైద్యపరీక్షలు నిర్వహించగా అందులో 51 డెల్టా ప్లస్ కేసులు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయని, తమిళనాడులో 9, మధ్యప్రదేశ్ లో 7, కేరళలో 3, గుజరాత్, పంజాబ్ లో రెండేసి కేసులు, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఒడిశాలో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

పొరుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, ఆంధ్రప్రదేశ్ లో!
తమిళనాడులో మొదటి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం కేసు నమోదు కావడంతో ఆ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇదే సమయంలో దేశంలోనే మహారాష్ట్రలో అధిక సంఖ్యలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications