Papaya Leaves Benefits: డెంగ్యూ వచ్చిందా.. ఆ ఆకులుంటే చాలు..!
మనకు బొప్పాయి విరిగా లభిస్తుంది. కానీ బొప్పాయిని ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బొప్పాయిలో పోషకాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయట. శరీరంలోని చెడు అమైనో ఆమ్లాలను తగ్గించడంలో బొప్పాయి ఉపయోగపడుతుందట.

ప్లేట్ లేట్స్
ఈ మధ్య డెంగ్యూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ వచ్చిన వారికి ప్లేట్ లేట్స్ తగ్గిపోతున్నాయి. ప్లేట్ లేట్స్ సంఖ్య తగ్గిపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ప్లేట్ లేట్స్ పెరగడానికి బొప్పాయి తినాలని చెబుతారు. తొందరగా పెరగాలంటే బొప్పాయి ఆకుల జ్యూస్ తాగాలని సూచిస్తారు.

యాంటీఆక్సిడెంట్
బొప్పాయి ఆకుల్లో ఉండే కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం కలిగి ఉంటాయి. తాజా బొప్పాయి ఆకుల రసాన్ని 3-4 రోజులు లేదా ప్లేట్‌లెట్స్ సాధారణ స్థాయికి వచ్చే వరకు తీసుకోవాలట. ఆకులను కొద్దిగా నీళ్లతో గ్రైండ్ చేసి, ఆపై రసాన్ని వడకట్టి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎంజైమ్‌లు
బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు తగ్గుతాయట. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, ఎంజైమ్‌లు వాపును తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో నీరు, పీచు ఎక్కువగా ఉంటుంది. అందుకే మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఇది ఎంతో ఉపయుక్తం.బొప్పాయి ఆకులలో కనిపించే పపైన్ ఏ ఔషధం కంటే తక్కువ కాదు. గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications