గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిర్చిలో కొత్త ఫంగ‌స్ : అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌..

|
Google Oneindia TeluguNews

మిర్చికి అంత‌ర్జాతీయంగా పేరున్న గుంటూరు మిర్చిలో కొత్త ఫంగ‌స్ ను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. దీని పై ర‌క‌ర‌కాలు గా ప్ర‌చారం జ‌రుగుతున్నా..దీని విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. స్థానికంగా కృష్ణా గుంటూరు జిల్లాలో మిర్చి పంట పై ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. దీంతో..కొత్త‌గా వ‌చ్చిన ఈ ఫంగ‌స్ పై లోతుగా అధ్య యనం చేస్తున్నారు..

గుంటూరు మిర్చి

గుంటూరు మిర్చి

ఏపి లోని గుంటూరు జిల్లాలో పండించే మిర్చిలో కొత్త త‌ర‌హా ఫంగ‌స్ ను గుర్తించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేక‌రించిన మిర్చి శాంపిళ్ల‌లో అధిక మోతాదులో ఈ పంగ‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు.
ఈ ఫంగ‌స్ నుండి విష పూరితాలు సైతం ఉత్త‌త్తి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఏపిలోని ప‌లు క‌ళాశాల‌ల‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నం చేసారు.
గుంటూరు మిర్చి విక్ర‌యించే అమ్మ‌కాల నుండి శాంపిల్స్ ను సేక‌రించారు.

ఎండుమిర్చిని శాంపిళ్లు సేక‌రించ‌గా.

ఎండుమిర్చిని శాంపిళ్లు సేక‌రించ‌గా.

మొత్తం ఏడు శాంపిళ్లు సేక‌రించ‌గా..అందులో అయిదింటిలో కొన్ని ఫంగ‌స్ కార‌కాల‌ను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. వీటి వ‌ల‌న కొంత ప్ర‌మాదం ఉంద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు.
ఎండుమిర్చిని మట్టిపై ఉంచడం వల్ల వివిధ రకాలు ఫంగస్ పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఆ ఫంగస్ నుంచి విడుదలయ్యే విష పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తాయని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ఎండ‌లో ఉంచిన త‌రువాత‌నే ..

ఎండ‌లో ఉంచిన త‌రువాత‌నే ..

ఈ ఫంగ‌స్ ను నిర్ల‌క్ష్యం చేయ‌టం వల్ల కాలేయం దెబ్బతింటుందని, కొన్ని సందర్భాల్లో కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాద ముందని హెచ్చ‌రిస్తున్నారు. వంటలోనూ, ఊరగాయల్లోనూ మిర్చిని ఉపయోగించే ముందు కొద్దిసేపు ఎండలో ఉంచాలని సూచించారు. పాడపోయిన మిర్చిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కాగా, గుంటూరు మిరపకు అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఏటా దాదాపు 2.80 లక్షల టన్నుల మిరప ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి నుంచి అమెరికా, బ్రిటన్, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తారు. తాజా ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యాల పై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి..మ‌రిన్ని ఫ‌లితాలు రాబ‌ట్టే ప్రక్రియ కొన‌సాగుతోంది.

English summary
new fungus found in guntur chilli samples. Scientists alert public when using this chilly kept in dry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X