గుంటూరులో ప్రియురాలి ఇంట్లో ప్రియుడి లైవ్ సూసైడ్ ... సోషల్ మీడియాలో వైరల్

గుంటూరు జిల్లాలో ఆన్ లైన్ లో ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడి మరణం సంచలనంగా మారింది. ఒక యువతిని ప్రేమించి, ఆమె కూడా తనను ప్రేమించాలని ఒత్తిడి చేసి యువతిని ఇబ్బందులకు గురి చేసిన యువకుడు ఆమె ఇంటికి వెళ్లి లైవ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వడ్లమూడి గోపీనాథ్ తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి మరి, ఆమె ముందే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెల్లంకొండ మండలం లోని న్యూ చిట్యాల ఆర్ ఆర్ సెంటర్ లో జరిగిన ఈ ఘటనలో గోపీనాథ ఆత్మహత్య చేసుకున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వడ్లమూడి గోపీనాథ్ ప్రేమ పేరుతో తన వెంట పడుతున్నాడని, అతని వేధింపులు తట్టుకోలేక ముందు జాగ్రత్తగా యువతి ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

 lover live suicide in Guntur ... viral on social media

ఈ క్రమంలో ప్రియురాలి ఇంటికి వచ్చిన గోపీనాథ్ తనను ప్రేమించుకుంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానని బెదిరించడమే కాకుండా, ఏకంగా ఆత్మ హత్య చేసుకున్నాడు.

సహజంగా ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్న వారు పెరిగిపోతున్న నేపథ్యంలో యువతి గోపీనాథ్ తీరుతో భయాందోళనకు గురి అయింది. దగ్గరికి వెళ్తే తనపై అటాక్ చేస్తాడేమో అని భయపడింది. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామంగా గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు . అయితే అదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+