గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘురామ హైడ్రామా.. హైకోర్టుకు మెడికల్ రిపోర్ట్, ఖైదీ నంబర్ కేటాయింపు, హత్యకు కుట్ర..?

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ నుంచి డ్రామా కొనసాగుతోంది. అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేశారు. తర్వాత గుంటూరు జిల్లా జైలుకు తలరించారు. ఆయన అభిమానులు వస్తారనే సమాచారంతో జైలు వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని గుంటూరు జిల్లా కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జైలుకు రఘురామను తరలించారు.

Recommended Video

Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu
ఖైదీ నంబర్ 3468

ఖైదీ నంబర్ 3468


రఘురామ కృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్ సిద్ధమైంది. జిల్లా మెజిస్ట్రేట్‌ జస్టిస్ ప్రవీణ్ కుమార్ సీల్డ్ కవర్‌లో అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక మెసెంజర్ ద్వారా నివేదికను జిల్లా కోర్టు సిబ్బంది పంపించారు. దానిని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు జిల్లా మెజిస్ట్రేట్ అందజేశారు. దీనిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. మెడికల్ రిపోర్టుపై అంతటా ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో రఘురామకృష్ణరాజుకు ఖైదీ నెంబర్ కేటాయించారు. రఘురామకు ఖైదీ నెం.3468 ఇచ్చారు జైలు అధికారులు.

ఇవాళ రాత్రి హత్య..?

ఇవాళ రాత్రి హత్య..?

ఇటు జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ కృష్ణ రాజు భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.. పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇవాళ రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళ్లపై గాయాలు ఉండటంతో అనుమానం...

కాళ్లపై గాయాలు ఉండటంతో అనుమానం...


రఘురామ కృష్ణరాజు స్వపక్షంలో విపక్షంలా మారారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేశారు. చివరికీ ఇటీవల హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుని విచారించింది. రెండు టీవీ చానెళ్లతోపాటు కుట్ర చేశారని కూడా నివేదిక రూపొందించారు. అయితే రఘురామ నడవలేకపోయారు. కొట్టారని ఆయన భార్య, ఇతరులు ఆరోపించారు. తాజాగా ప్రాణానికే ప్రమాదం ఉంది అని కామెంట్ చేశారు.

English summary
today night my husband will be murdered raghu rama krishnam raju wife ramadevi scared
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X