గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద విద్యార్థులు మృతి

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది.
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో స్నానానికి దిగిన వారంతా గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు.

మృతి చెందిన విద్యార్థులంతా మాదిపాడు వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం వేదపాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు.

Tragedy: six Veda students drowned in Guntur district.

ప్రమాదవశాత్తూ ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులు హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్ కుమార్ దీక్షిత్ గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.

మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగా చలం వేద పాఠశాలలో గత ఐదేళ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నారు. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు అధికారులుపై మండిపడుతున్నారు. నదిలో ఇంకా విద్యార్థులు ఎవరైనా గల్లంతయ్యారేమోనన్న అనుమానంతో బోట్ల సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

English summary
Tragedy: six Veda students drowned in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X