• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో..ఏమీ ఘోరం.. నాలుగేళ్ల చిన్నారి హత్య..? షట్టర్ ముందు అచేతనంగా

|
Google Oneindia TeluguNews

బుధవారం.. అమావాస్య... ఆపై దీపావళి.. ఇంకేముంది క్షుద్రపూజలు చేసేవారికి పండగే. పూజల కోసం మేకనో, కోడినో బలి తీసుకుంటే సరిపోతుంది. కానీ కొందరు పిల్లలను చంపి.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై ఎంత అవగాహన కల్పించిన ప్రయోజనం లేకుండా పోతోంది. నెలకో చోట ఇలాంటి ఘటన వెలుగుచూస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఓ చిన్నారి విగతజీవిగా కనిపించింది.

అయితే ఆ చిన్నారి ఎవరు..? ఎలా చనిపోయింది.. చంపింది ఎవరనే విషయాలు తెలియరాలేదు. కానీ క్షుద్రపూజలు మాత్రం జరిగాయనే అనుమానాలు మాత్రం బల పడుతున్నాయి. ద్వారకాపురి కాలనీలో షాపు ఎదుట నాలుగేళ్ల చిన్నారి మృతదేహం పడి కనిపించింది. అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమావాస్య రోజున క్షుద్రపూజలు జరిగాయని స్థానికులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణ ప్రారంభించారు.

4 years child murder at punjagutta

ఘటనకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తొలుత సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు సంబంధించి నిజ నిజాలు వెలికి తీస్తామని అంటున్నారు. కానీ ఆ చిన్ని తల్లి కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. తిరిగిరానీ లోకాలకు వెళ్లి గుండుకోతను ఇచ్చింది. ఆ పనిచేసిన వారు మాత్రం ఇప్పటికీ హాయిగా ఉన్నారు. కానీ చట్టానికి దొరకకుండా తప్పించుకోలేరు. రేపో మాపో తప్పకుండా దొరుకుతారు.

Recommended Video

  ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu

  శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశం దూసుకెళ్తోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపించి.. టెక్నాలజీ మరింత డెవలప్ అవుతోంది. కానీ కొందరు మాత్రం మారడం లేదు. రోగం పేరు చెప్పి నరబలి ఇస్తున్నారు. ఎక్కడ ఎవరు దొరుకుతారోనని చూసి.. ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. తమ స్వార్థం కోసం అన్నెం పున్నెం ఎరుగని వారిని బలి చేస్తున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా బుద్ది చెప్పాలి. లేదంటే మరెందరో అమాయకులు బలి అవుతారని ప్రజా సంఘాల నేతలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

  English summary
  bizarre incident happen at hyderabad punjagutta. a 4 year child murdered. deadbody shown infront of shop.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X