ఈస్ట్ జోన్ డిసిపి ఆఫీస్ లో సందడి చేసిన ఓ బుజ్జి పోలీస్ .. బుడతడి హడావిడి మామూలుగా లేదుగా !!

ఈరోజు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఆఫీస్ లో ఓ బుజ్జి పోలీస్ అధికారి సందడి చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ను మానిటర్ చేస్తూ, పెట్రోలింగ్ వాహనం లో తిరుగుతూ పోలీసింగ్ చేశారు. అందరినీ ఆనందాశ్చర్యాలతో ముంచెత్తిన ఆ ప్రత్యేకమైన అతిథి గురించి ఈరోజు ఈస్ట్ జోన్ డిసిపి ఎం రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఆన్ లైన్ క్లాసులతో బోర్ ... అందుకే కాసేపు పోలీస్ అవతారమెత్తిన బుడతడు

ఆన్ లైన్ క్లాసులతో బోర్ ... అందుకే కాసేపు పోలీస్ అవతారమెత్తిన బుడతడు

ఫ్రెండ్లీ పోలీసింగ్ నిజమైన అర్థం చెబుతున్నారు పోలీసులు. ఎల్ కేజీ చదువుతున్న ఓ బుజ్జిబాబు ఆన్లైన్ క్లాసుల నేపద్యంలో పాఠాలను వినడం బాగా బోర్ గా ఫీల్ అయ్యారు. చాలా రోజుల నుండి ఇంటికే , ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయిన ఆ బుడతడు కాస్త ఆటవిడుపు కావాలనుకున్నాడు . ఒక బ్రేక్ తీసుకుందాం అని భావించిన నేపథ్యంలో ఏకంగా పోలీస్ అవతారమెత్తి హల్ చల్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఎల్కేజీ మాస్టర్ సుహాస్ పోలీస్ కావాలని తన కోరికను తీర్చుకున్నాడు.

ఇంట్లో నిత్యం పోలీస్ అవుతానని గొడవ .. సరదా తీర్చిన ఈస్ట్ జోన్ డీసీపీ

ఆన్లైన్ క్లాసులు తో బోర్ కొట్టిన సదరు బుడతడికి పోలీస్ గా అవకాశం కల్పించారు ఈస్ట్ జోన్ డిసిపి ఎం రమేష్.

మాటిమాటికి ఇంట్లో పోలీస్ అవుతానని గట్టిగా చెప్పే మాస్టర్ సుహాస్ ను తీసుకొని అతని తండ్రి, తాత పోలీస్ స్టేషన్కు వచ్చారని బుడతడి కోరిక చెప్పడంతో, కాసేపు పోలీస్ గా పిల్లవాడి సరదా తీర్చామని, పోలీస్ కావాలన్న బలమైన కోరిక ఉన్న నేపథ్యంలో ఇది ఆ బాబుకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఈస్ట్ జోన్ డిసిపి ఎం రమేష్ చెబుతున్నారు.

పెట్రోలింగ్ , సీసీ టీవీ ఫుటేజ్ మానిటరింగ్ .. ఇంకా సలహాలు కూడా చెప్పిన బుజ్జి పోలీస్ బాస్

కాసేపు పెట్రోలింగ్ వాహనంలో తిరిగి, సీసీటీవీ ఫుటేజ్ ను మానిటర్ చేసిన మాస్టర్ సుహాస్ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పోలీసులకు సహకరించాలని తన సందేశాన్ని అందించారు. అంతేకాదు కరోనా సమయంలో మాస్కు ధరించాలని, శానిటైజర్ లను వాడాలని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. బుడతడు పోలీస్ కాగానే అందరికీ బాధ్యతాయుతంగా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాడని ఆటను చెప్పిన విషయాలు విన్నవారు నవ్వుకుంటున్నారు . తప్పక ఆ సూచనలు పాటిస్తాం అంటున్నారు . ఇక డిసిపి ఆఫీసు లో పనిచేసిన సిబ్బంది బుజ్జి పోలీస్ అధికారిని చూసి తెగ ముచ్చట పడ్డారు. బుడతడి కి సకల మర్యాదలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+