హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమికులారా జర భద్రం..! హైదరాబాద్‌లో ఇవే మంచి స్పాట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రేమలో పడ్డవారి లోకమే వేరు. ఆ మధురమైన అనుభూతితో ప్రపంచమే కనిపించదు. ప్రేమకున్న శక్తి ఏదైనా సాధించేలా చేస్తుంది. ఎంతవరకైనా తీసుకెళుతుంది. ప్రేమలో మునిగితేలుతున్నవారు వాలెంటైన్స్ డే ను మరింత అందంగా జరుపుకోండి. మధురానుభూతులతో 2019 ప్రేమికుల రోజుకు డైరీలో చోటు కల్పించండి. ఎక్కడకు వెళ్లాలి, ఎక్కడ ఏకాంతం దొరుకుతుంది, మనసువిప్పి ఊసులాడుకోవడానికి ఏ ప్రదేశాలు బాగుంటాయి. ఇలాంటి వాటి గురించి ఎదురుచూసే ప్రేమపక్షుల కోసం హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి దూరప్రాంతాలను ఎంచుకోకండి. అలాగే తెలియని ప్రాంతాల జోలికి అసలు వెళ్లకండి. ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి వీడి.. ముందు జాగ్రత్తగా వ్యవహరించండి.

ప్యార్ షెహర్..

ప్యార్ షెహర్..

హైదరాబాద్... పేరులోనే తెలియని గమ్మత్తు దాచుకుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే లక్షలాది మందికి నీడనిస్తోంది. అలా ప్రేమికులకు కూడా ప్రత్యేకమైన చోటు కల్పిస్తోంది. చారిత్రక కట్టడాలతో నిండి ఉన్న హైదరాబాద్ షెహర్.. రొమాంటిక్ భావాలతో ప్రేమికులను మరింత దగ్గర చేస్తుంది. భాగ్యనగరంలో ప్రేమజంటలకు తావివ్వడానికి చాలా ప్రదేశాలు స్వాగతం పలుకుతాయి. తమలోని ప్రేమను సరైన రీతిలో వ్యక్తపరచడానికి అవి దోహదపడతాయి. ఇక ప్రేమలో మునిగి తేలుతున్నవారి బంధం మరింత బలపడటానికి సహకరిస్తాయి.

ప్రకృతి ఒడిలో.. అలా అలా

ప్రకృతి ఒడిలో.. అలా అలా

చాలామంది ప్రేమికులు ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు ఇష్టపడతారు. పక్షుల కిలకిలరావాలు ఓవైపు, ప్రేమ ఊసులు మరోవైపు.. అలా ప్రేమికులు ప్రకృతిలో తమకు తెలియకుండానే మిళితమవుతారు. అందుకే పార్కులు ప్రేమజంటలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.

హుస్సేన్‌ సాగర్ ‌- నెక్లెస్ రోడ్డు :

సాయం సంధ్యాకాలం హుస్సేన్ సాగర్ దగ్గరకు వెళితే చాలు.. మన బాధనంతా తాను దిగమింగి మనకు సరికొత్త అనుభూతులు పంచుతుంది. అదేదో మహిమ కాదు, అక్కడి స్థల ప్రభావం. ప్రకృతి రమణీయత అందించే గొప్ప వరం. అందుకే వాలెంటైన్స్ డే నాడు హుస్సేన్ సాగర్ దగ్గరకు వెళ్లడం ప్లాన్ చేసుకుంటే ప్రేమికులకు ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలుకుతుంది. అక్కడినుంచి వెళితే పక్కనే ఉన్న లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌, నెక్లెస్ రోడ్డు, ఈట్ స్ట్రీట్ ప్రాంతాల్లో సేదదీరవచ్చు.

గోల్కొండ :

చారిత్రక కట్టడంతో అలరించే గోల్కోండ ఫోర్ట్ కు వెళితే చాలు మనసు తేలిక పడుతుంది. ఎంత టెన్షన్ ఉన్నా గానీ.. అక్కడి వాతావరణంతో అన్నీ మరచిపోతాం. వాలెంటైన్ డే నాడు ప్రేమికులు వెళ్లాల్సిన మంచి స్పాట్. మనసులోని భావాలు పెదవి దాటి బయటకు రప్పించే అద్భుతమైన వేదిక. కొత్తగా ప్రేమలో పడ్డవారికి గోల్కోండ ఫోర్ట్ మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ప్రేమ ఊసులు చెప్పుకుంటూ ఆహ్లాదభరితమైన వాతావరణంలో ప్రేమికుల రోజును మరింత ఆనందంగా గడపొచ్చు.

దుర్గం చెరువు :

సీక్రెట్ లేక్ గా ముద్రపడ్డ దుర్గం చెరువు ప్రేమికులకు మరో బెస్ట్ డెస్టినేషన్. చుట్టూ చెరువు, మధ్యలో చెట్లు.. ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్న దుర్గం చెరువు.. ప్రేమికులకు కూడా స్వాగతం పలుకుతోంది. ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పొచ్చు. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో ఉండే దుర్గం చెరువుకు ప్రేమికులు క్యూ కడతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ తమను తాము మైమరచిపోతారు. బ్యూటీఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్ టు వాలంటైన్స్ డే.

భద్రం.. బీ కేర్ ఫుల్

భద్రం.. బీ కేర్ ఫుల్

వాలెంటైన్స్ డే సందర్భంగా నిజమైన ప్రేమికులకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. అదే సమయంలో ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారి తాట తీసేందుకు కూడా సన్నద్ధమైంది. కొందరి కారణంగా నిజమైన ప్రేమికులు కూడా ఇబ్బందులు పడుతున్న సందర్బాలున్నాయి. వాలంటైన్స్ డేను మీ ప్రేమ జీవితంలో పదిలంగా దాచుకునేట్లుగా ప్లాన్ చేసుకోండి. అదే సమయంలో పోకిరీల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. తెలియని ప్రదేశాలకు అస్సలు వెళ్లకండి. ప్రేమికులను టార్గెట్ చేసే ముఠాల ఆకృత్యాలకు చోటు ఇవ్వకండి.

English summary
The world does not appear to be that sweet feeling for lovers. The power of love makes any effort. It takes you to anything. Those who fall in love make Valentine's Day more beautiful. Some beautiful spots in hyderabad for true lovers, here report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X