పోలింగ్ నాడు అందరికి సెలవు.. తేల్చి చెప్పిన ఈసీ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 7న సెలవు ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఆ రోజు హాలిడే ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు పోలింగ్ తేదీనాడు సెలవు ప్రకటించలేదు. దీంతో ఆయా సంస్థల ఉద్యోగులు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈమేరకు స్పందించిన ఈసీ ప్రధానాధికారి రజత్ కుమార్ డిసెంబర్ 7న సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేబర్ డిపార్టుమెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీలు, సంస్థలు ఓటింగ్ నాడు సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే లేబర్ లా ప్రకారం చట్టపర్యమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇదివరకే డిసెంబర్ 7న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేతనంతో కూడిన హాలిడే మంజూరు చేయాలని సూచించింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications