హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..! తుది కసరత్తు చేస్తున్న అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్థానికి సమరానికి తెరలేవ బోతోంది. తెలంగాణలో మరో రాజకీయ పోరాటానికి పార్టీలు నడుం బిగిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. షెడ్యూల్లోపే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. జులై 10న డ్రాఫ్ట్ సిద్ధమవుతోందని స్పష్టం చేసింది. 12వ తేదీ లోపు పార్టీలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తామన్నారు ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

14 వ తేదీ తర్వాత నోటిఫికేషన్..! కసరత్తు చేస్తున్న అదికారులు..!!

14 వ తేదీ తర్వాత నోటిఫికేషన్..! కసరత్తు చేస్తున్న అదికారులు..!!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తొలి అడుగు పడింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో వివిధ పార్టీ నేతల అభిప్రాయాలను ఎన్నికల సంఘం సేకరించింది. తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ జులై 10న సిద్ధమవుతుంది.

పకడ్బందీగా ఎన్నిలకు..! ప్రలోభాలకు తావు లేదన్న నాగిరెడ్డి..!!

పకడ్బందీగా ఎన్నిలకు..! ప్రలోభాలకు తావు లేదన్న నాగిరెడ్డి..!!

ఎన్నికల నోటిఫికేషన్కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని నాగిరెడ్డి చెప్పారు. 14 వ తేది తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. బ్యాలేట్ పేపర్ ఎన్నికలు జరుగుతాయి. 50 లక్షల మంది ఓటర్లుండగా... ప్రతీ 800మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల జాబితాపై లేదా.. ఇతర పిర్యాదులు, సూచనలను జులై 12వ తేదీలోగా మున్సిపల్ కమిషనర్కు చెప్పవచ్చు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల గుర్తులను వారికే కేటాయిస్తారు.

నిబంధనల మేరకే గుర్తులు..! పార్టీలు సంయమనం పాటించాలన్న ఈసీ..!!

నిబంధనల మేరకే గుర్తులు..! పార్టీలు సంయమనం పాటించాలన్న ఈసీ..!!

కామన్ సింబల్ కావాలనుకునే వారికి నిబంధనల ప్రకారం గుర్తు కేటాయిస్తారు. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను నేతలు తప్పుపట్టారు. ఇప్పటికిప్పుడు హాడావుడిగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖారారులో అధికార పార్టీ అధిపత్యం ఉందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణకు 119 రోజుల సమయం అడిగి.. హడావుడిగా 14 రోజులకు ఎందుకు కుదిస్తున్నారని వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

పారదర్శకంగా వ్యవహరించాలి..! ఈసి ని కోరుతున్న వివిధ పార్టీలు..!!

పారదర్శకంగా వ్యవహరించాలి..! ఈసి ని కోరుతున్న వివిధ పార్టీలు..!!

ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ కాకుండా ఉండాలంటున్న నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలకు 6 నెలల సమయం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జులై11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

English summary
EC is preparing for municipal elections in Telangana. The Election Commission, which is conducting municipal elections on schedule, has made it clear that the draft is being prepared on July 10. Complaints and suggestions from parties and the public will be received before the 12th, Election Commissioner Nagireddi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X