హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. నకిలీ ఆధార్. 8 మంది సభ్యుల అరెస్ట్.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

నకిలీల హవా నడుస్తోంది. సర్టిఫికెట్లు, బ్రాండ్లను కూడా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తించడం కాస్త కష్టం అవుతుంది. అయితే నకిలీ సర్టిఫికెట్ల ముఠా చివరికీ రట్టయ్యింది. పోలీసులు పకడ్బందీగా ఆ ముఠాను పట్టుకున్నారు. వారు ఏదో డాక్యుమెంట్లో కాదు.. ఆధార్ కార్డు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులే ఒక విధంగా షాకయ్యారు. ఇదేంటి వీరు నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారా అని నోరెళ్లబెట్టారు.

నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ తయారు చేసే ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ చెప్పారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 6 ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫాంమ్స్, ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డ్ , 80 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

fake certificate racket arrested in hyderabad

మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోర్జరీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలతో ముఠా భారీ మోసాలకు పాల్పడుతోంది. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోంచి డౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ను ఫోర్జరీ చేస్తోందని పోలీసు కమీషనర్ చెప్పారు ముఠా ఇప్పటివరకు 3 వేల ఆధార్ కార్డ్స్ జారీ చేసిందని... వీటిలో 100 ఫేక్ కార్డ్స్ గుర్తించామని ఆయన తెలిపారు. ఒక్కో కార్డుకు వెయ్యి నుంచి రెండు వేల రాపాయల వరకు ఈ ముఠా డబ్బులు వసూలు చేసిందని అంజనీ కుమార్ వివరించారు.

ఆధార్ అంటే ఐడెంటి.. దాని కూడా నకిలీవి చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది. తమ భద్రతకు దిక్కు లేదా అనే సందేహాం ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. దీంతోనైనా కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. నకిలీలకు తావులేకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంది.

English summary
fake certificate racket arrested in hyderabad. eight people are arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X