హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోమలు ఇప్పుడైన చస్తాయా...? ఆధునూతన టెక్నాలజీతో దోమల నివారణ : జీహెచ్ఎంసీ మేయర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్న దోమలు అధికమవుతున్నాయి.. ముఖ్యంగా దోమలు ఉండే చెరువులతో పాటు మురికి కాల్వల్లోకి మనుష్యులు వెళ్లి పిచికారి చేయలేని పరిస్థితి. దీంతో ఆయా ప్రాంతాల్లో దోమల లార్వానే నిర్విర్యం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు హైటెక్ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే దోమలను నివారించేందుకు డ్రోన్లను వాడుతున్నారు.

 డ్రోన్ల ద్వార దోమల నివారణ

డ్రోన్ల ద్వార దోమల నివారణ

దోమలు ముఖ్యంగా చెరువులతోపాటు మురికి కాలువల్లో ఎక్కువగా తమ సంతోత్పత్తిని చేస్తాయి. అయితే దోమల నివారణకు జీహెచ్ఎంసీ పిచికారి చేస్తున్నా...చెరువుల లాంటీ ప్రాంతాల్లో మనుష్యులు వెల్లలేని పరిస్థితి. ఇందుకోసమే హైటెక్నాలజీతో దోమల నివారణ చేపడుతున్నారు. దోమల లార్వాను నాశనం చేసే ఉద్దేశ్యంతో డ్రోన్ల ద్వార పిచికారి చేయిస్తున్నారు. కాగా డ్రోన్ల ద్వార పిచికారిని ఇదివరకే జీహెచ్ఎంసీ అధికారులు ప్రయోగత్మకంగా పరీశీలించారు. ప్రస్థుతం దోమల సీజన్ కావడంతో మియాపూర్‌ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్‌ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మేయర్‌తోపాటు ప్రారంభించారు.

జీహెచ్ఎంసీ విన్నూత్న ప్రయోగం

జీహెచ్ఎంసీ విన్నూత్న ప్రయోగం

కాగా డ్రోన్లలో బయో ఎంజైమ్‌ను నింపి దాన్ని చెరువుల్లో స్ప్రే చేయిస్తున్నారు. దీని ద్వార దోమలు చనిపోవడంతోపాటు లార్వా కూడ విచ్చిన్నం కానుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చెరువుల్లో దీన్ని వేప ఆకులు, ఆవు పేడ, తో పాటు ఇతర మిశ్రమంతో ఈ స్ప్రే ను తయారు చేస్తున్నారు. దీని ద్వార దోమలతో పాటు దోమలకు ఆవాసాలుగా ఉండే చెట్లు సైతం మృతి చెందుతాయని వారు తెలిపారు. అనంతరం దోమలు కూడ అకస్మత్తుగా చనిపోతాయని అంటున్నారు..

రోజులో 25 ఎకరాలకు స్ప్రే

రోజులో 25 ఎకరాలకు స్ప్రే

ఒక్క రోజులో డ్రోన్ల ద్వార 25 ఎకరాల వరకు స్ప్రే చేయనున్నారు. డ్రోన్‌ల ద్వార, 25 మంది చేసే పనిని కేవలం పది నిమిషాల్లో చెరువును పూర్తిగా మందును వెదజల్లడంతో ఒక్క రోజులో 25 ఎకరాల ప్రాంతాన్ని డ్రోన్స్ ను వాడి దోమలను నివారించవచ్చని తెలిపారు. కాగా ఇలా గంటలో కనీసం అయిదు ఎకరాల ప్రాంతాన్ని ఇవి స్ప్రే చేయనున్నాయి. వీటీ ద్వార సమయంతో పాటు డబ్బుకూడ ఆదా అవుతుండడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.ఇక ఇదే స్ప్రేను మనుష్యులతో చేయిస్తే మాత్రం చాల రోజుల పట్టే అవకాశం ఉంటుంది.

English summary
GHMC has taken up mosquito prevention with drones.Mayor Bonthu Rammohan attends mosquito prevention program with drones at Miyapur pond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X