హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆరే ఆపించారు.. దళితబంధు పెట్టి, నిలిపివేసిన ఘనత ఆయనదే: విజయరామారావు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ దళితబంధు ప్రధాన అస్త్రంగా మారింది. ఈ పథకంతో ఓట్లు రాలతాయని అధికార పార్టీ అనుకుంది. కొందరికీ నిధులు కూడా విడుదల చేసింది. అయితే నిన్న ఈసీకి ఫిర్యాదు చేయడం.. స్పందించడం, నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదీ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. దళితబంధును నిలిపివేసింది అధికార పార్టీయేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి కౌంటర్ అటాక్ టీఆర్ఎస్ చేస్తోంది. దళిత బంధును నిలిపివేసింది ఎవరూ అని అడుగుతోంది.

10 రోజుల్లో బై పోల్

10 రోజుల్లో బై పోల్


10 రోజుల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసింది. బీజేపీనే కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు విజయరామారావు స్పందించారు. దళితబంధుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఫిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీనే అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది.

దళితుల ఓట్లు

దళితుల ఓట్లు

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే దళితుల ఓట్లు కావాలని... అందుకే దళితబంధును కేసీఆర్ తానే ప్రారంభించి, తానే ఆగిపోయేలా చేశారని విజయరామరావు ఆరోపించారు. దళితబంధును బీజేపీ ఆపించిందని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయప విమర్శించారు. దళితబంధును కేసీఆర్ ఆపివేస్తారని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధును తొలుత స్వాగతించింది బీజేపీ పార్టీయేనని గుర్తుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా..

రాష్ట్రవ్యాప్తంగా..

హుజూరాబాద్‌లో కాక రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరామని చెప్పారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే విషయం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరికీ తెలుసని అన్నారు. అందుకే ప్రచారానికి దూరంగా ఉన్నారని కామెంట్ చేశారు. వాస్తవానికి కేటీఆర్ క్యాంపెయిన్ చేయనని స్పష్టంచేశారు. ఈ నెల 27వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. కానీ విజయరామరావు మాత్రం.. ఊరికేనే ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు.

హాట్ కామెంట్స్

హాట్ కామెంట్స్

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విమర్శలు- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. విజయ రామరావు ఏకంగా కేసీఆరే ఆపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
telangana cm kcr is reason for dalitha bandhu stop bjp leader vijaya rama rao alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X