హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron:మాస్క్ మ్యాండేటరి.. లేదంటే రూ.1000 ఫైన్, తెలంగాణ సర్కార్ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ అంటేనే దడ దడ.. వైరస్ తీవ్రత దృష్ట్యా అంతా హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 24 దేశాలకు వ్యాపించింది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించి.. అంతర్జాతీయ విమాన రాకపోకలను నిషేధించాయి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వైరస్ నిర్మూలన వ్యాక్సిన్ తీసుకోవడం, ఫిజికల్ డిస్టన్స్, మాస్క్ వాడటం కంపల్సరీ అవుతుంది. దీంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం మాస్క్ మ్యాండెట్ చేసింది.

 మహిళకు కరోనా.. టెస్టుల కోసం

మహిళకు కరోనా.. టెస్టుల కోసం

యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏళ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా వచ్చిందని ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. మాస్క్ ధ‌రించ‌క‌పోతే పోలీసులు రూ. వెయ్యి జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతోపాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.

 నియమ, నిబంధనలు

నియమ, నిబంధనలు


ఒమిక్రాన్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని ఆయన తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలని కోరారు. అంద‌రూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ నివార‌ణ‌కు తమ వంతు ప్ర‌య‌త్నం చేయాలని.. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇప్పుడు జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలే వాస్త‌వాలు అవుతాయని హెచ్చరించారు.

325 మంది ప్రయాణికులు

325 మంది ప్రయాణికులు

యూకే, సింగ‌పూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 325 మంది ప్ర‌యాణికులు నిన్న వచ్చారని వివరించారు. రాష్ట్రానికి చెందిన వారు 239 మంది ఉన్నారు. వీరంద‌రికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేశామ‌న్నారు. యూకే నుంచి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆమెను త‌క్ష‌ణ‌మే గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించి ఐసోలేష‌న్‌లో ఉంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఆమె నుంచి శాంపిళ్ల‌ను సేక‌రించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించామని వివరించారు. మూడు, నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వ‌స్తేనే ఆ వైర‌స్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విష‌యం తేలుతుంద‌న్నారు.

3 రోజుల్లో 24 దేశాలకు..

3 రోజుల్లో 24 దేశాలకు..

3 రోజుల్లో మూడు దేశాల నుంచి 24 దేశాల‌కు ఒమిక్రాన్ వేరియంట్ విస్త‌రించింద‌ని శ్రీనివాస్ రావు తెలిపారు. ప్ర‌జ‌లు అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. డిసెంబ‌ర్ 31వ తేదీలోపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకంటున్నామ‌ని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో వైర‌స్‌ను అరిక‌ట్టొచ్చని పేర్కొన్నారు. ఫంక్ష‌న్స్, పండుగ‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరారు.

25 లక్షల మందికి

25 లక్షల మందికి

రాష్ట్రంలో 25 ల‌క్ష‌ల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నారని.. 15 ల‌క్ష‌ల మందికి పైగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్నారని చెప్పారు. 80 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు డోసులు తీసుకోవ‌డం ద్వారానే పూర్తి ర‌క్ష‌ణ ల‌భించే అవ‌కాశం ఉంద‌న్నారు. మాస్కులే వ్యాక్సిన్‌లా ప‌ని చేస్తాయని... మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. 1000 జ‌రిమానా పోలీసులు విధిస్తారని చెప్పారు. సామాజిక బాధ్య‌త‌గా వ‌చ్చే రెండు, మూడు నెల‌లు మాస్కు ధ‌రిస్తే థ‌ర్డ్ వేవ్‌ను అరిక‌ట్టే అవ‌కాశం ఉందన్నారు. అన్ని ర‌కాల ప‌ని ప్ర‌దేశాల్లో, ప్ర‌యాణికులు కూడా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచుకోవాలని శ్రీనివాస్ రావు సూచించారు.

ఆర్టీ పీసీఆర్

ఆర్టీ పీసీఆర్

ఇటు విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. 'ఎట్‌ రిస్క్‌' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్‌, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్‌ హిస్టరీ సేకరించాలని సూచించింది.

English summary
Omicron:mask mandatory in telangana state otherwise police will fine rs.1000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X