Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో పాక్షికంగా చంద్రగ్రహణం: ఆలయాల్లోకి రేపు భక్తుల అనుమతి

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం పలు దేశాల్లో కనువిందు చేసింది. అయితే, తెలంగాణలో చంద్ర గ్రహణం పాక్షికంగానే కనిపించింది. చంద్ర గ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

హైదరాబాద్ నగరంలో సాయంత్ర 2.39 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కాగా, సాయంత్రం 5.12 గంటలకు పూర్తిగా కనిపించింది. చీకటి పడటంతో పాక్షిక చంద్రగ్రహణమే కనిపించింది.పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు చంద్రుడిని వీక్షించారు. చంద్ర గ్రహణం 6.19 గంటలకు చంద్ర గ్రహణం పూర్తిగా ముగిసింది.

Partial Lunar eclipse in telangana: temples will open tomorrow morning.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చంద్ర గ్రహణాన్ని ఆసక్తిగా తిలకించారు. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు సూచించడంతో.. ప్రజలందరూ చంద్ర గ్రహణాన్ని తిలకించారు. పలువురు బిర్లా ప్లానిటేరియంలో చంద్ర గ్రహణం వీక్షించారు.

పాక్షిక చంద్ర గ్రహణాన్ని పలువురు తమ కెమెరాలు, ఫోన్లలో బంధించారు. చంద్ర గ్రహణం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయాల్లో శుద్ధి, సంప్రోక్షణ చేశారు. బుధవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+