హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

గురువారం (17వ తేదీ) నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణాల స్వీకారాలు జరగనున్నాయి. దానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు సీఎం కేసీఆర్.
11 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి.

protem speaker oath ceremony

18వ తేదీ శుక్రవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. 19వ తేదీ శనివారం నాడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మండలి సమావేశం మొదలవుతుంది. అదే రోజు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20వ తేదీ ఆదివారం నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.

English summary
MIM senior MLA Mumtaz Ahmed Khan was sworn in as Telangana Assembly Protem Speaker. He has won six time MLA from the Charminar Assembly segment. Telangana Assembly meetings will be held for four days from the 17th january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X