హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షం ఎఫెక్ట్: 3 రోజులు స్కూళ్లకు సెలవు: సీఎం కేసీఆర్, కలెక్టర్లతో సీఎస్ రివ్యూ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వర్షం దంచి కొడుతుంది. రాత్రి పూట కూడా వర్ష బీభత్సం కంటిన్యూ అవుతుంది. దీంతో రేపటి నుంచి (సోమవారం) నుంచి తిరిగి స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అసలే వాన.. ఆపై ముసురుతో పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో రాష్ట్రంలో అన్నీ పాఠశాలలకు సోమ, మంగళ, బుధవారం సెలవు ప్రకటించింది.

3 రోజుల నుంచి వర్షాలు

3 రోజుల నుంచి వర్షాలు

గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

బీ అలర్ట్..

బీ అలర్ట్..

సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ప్రత్యేక శిబిరాలకు తరలించండి

ప్రత్యేక శిబిరాలకు తరలించండి

ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అన్ని జిల్లాల‌ కలెక్టరేట్ల‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలని సూచించారు. రోడ్లకు నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.

English summary
rain effect:schools are closed in 3 days telangana government release orders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X