హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్మ వేస్ట్ ఫెలో.. ద్రౌపది కామెంట్లపై రాజాసింగ్.. కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

రాం గోపాల్ వర్మ.. రచ్చ చేయడం ఈయనకు అలవాటే. ఏ విషయంలోనైనా వేలుపెట్టి.. పెంట పెంట చేస్తారు. అయితే ఎన్డీఏ తరఫున రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగారు. ఆమెను ఉద్దేశించి కామెంట్ చేశారు. ద్రౌపది ఆమె అయితే పాండవులు ఎవరూ...? కౌరవులు ఎవరూ..? అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

వర్మపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అని అన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానానికి ఎన్నిక అవుతున్న తరుణంలో ఇలాంటి ట్వీట్ బాధ కలిగించిందని చెప్పారు. తన ట్వీట్ పై వర్మ వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని చెప్పారు.

ram gopal varma waste fellow: raja singh

బీజేపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఆర్జీవీపై ఫైర్ కావ‌ట‌మే కాదు.. అబిడ్స్ పోలీస్ స్టేష‌న్‌లో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని కించ‌ప‌రిచేలా కామెంట్ చేశారని ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వ‌ర్మ‌పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టాల‌ని, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని పోలీసులను బీజేపీ నాయ‌కులు కోరారు. రాష్ట్రపతి అభ్యర్థిపై అల కామెంట్ చేయటం తగదని నెటిజన్స్ తమ అభిప్రాయ పడుతున్నారు. వర్మ చేసిన ట్వీట్‌లో ఒకరేమో వర్మను ఉద్దేశించి నువ్వు శకుని .. నేను కృష్ణుడిని అంటూ కామెంట్స్ చేశారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.

English summary
ram gopal varma waste fellow bjp mla raja singh angry on director
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X