• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Samantha:యూ ట్యూబ్ చానెళ్లపై పరువునష్టం దావా.. కోర్టులో పిల్

|
Google Oneindia TeluguNews

సామ్-చై విడిపోయారు. అయినా వారిద్దరూ వార్తల్లో ఉంటున్నారు. వారికి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఈ మధ్య ప్రీతమ్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. వారిద్దరూ ఫ్రెండ్స్ అని.. అక్క, తమ్ముడు అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యాయి. ఇక్కడితో అటువంటి రూమర్లు ఆపండి అంటూ సమంత రిక్వెస్ట్ చేసినా సరే.. గాసిప్స్ రాస్తూ ఆ వీడియోలను వైరల్ చేశారు.

పరువుకు భంగం

పరువుకు భంగం

సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వార్తలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై కూకట్‌పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా కేసు వేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీతోపాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌‌పై సమంత పిల్ దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు న్యాయవాది బాలాజీ, సమంత తరుపున వాదనలు వినిపించారు.

ప్రొఫెషనల్ లైఫ్

ప్రొఫెషనల్ లైఫ్


చై - సామ్ విడాకుల అనంతరం ప్రొఫెషన్‌ల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. సమంత 'శాకుంతలం' షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఇటీవలే సామ్ తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తున్న రెండు సినిమాలు అనౌన్స్ చేశారు.

పెయిన్

పెయిన్

అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో సమంత పరువు నష్టం దావా వేశారు.

English summary
actress Samantha file Defamation suit on youtube channels for promote her private life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X