• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారే కారణం..? దేవరాజ్, సాయి విచారణ పూర్తి, పరారీలో నిర్మాత..?

|

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడుతోంది. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను విచారించిన పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. దేవరాజ్, సాయికృష్ణ.. వేధింపులు భరించలేక శ్రావణి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తెలిసింది. కేసును అన్నీ కోణాల్లో విచారిస్తున్నామని.. త్వరలో వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు..లొంగిపోయిన దేవరాజ్.. నేడు సాయికృష్ణారెడ్డి విచారణ

ప్రశ్నల వర్షం..

ప్రశ్నల వర్షం..

దేవరాజ్ రెడ్డిని ఎస్ఆర్ నగర్ పోలీసులు మూడురోజులు విచారించారు. మరో నిందితుడు సాయిని కూడా ఆదివారం ప్రశ్నించారు. దీంతో వీరి విచారణ పూర్తయ్యింది. శ్రావణి చనువుగా ఉండటమే కారణమని, గొడవలకు దారితీసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకరు చనువుగా ఉండటం మరొకరు జీర్ణించుకోలేరని.. దేవరాజ్, సాయి కూడా గొడవ అందుకే పడ్డారని తెలిపారు.

విచారణ పూర్తి.. పరారీలో అశోక్ రెడ్డి

విచారణ పూర్తి.. పరారీలో అశోక్ రెడ్డి

ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. శ్రావణికిని తల్లిదండ్రులు, సాయి వేధించినట్టు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్‌ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలకు సంబంధించి సాంకేతిక ఆధారాలు అన్నీ సేకరించామని పేర్కొన్నారు. దేవరాజ్, సాయి రెడ్డిను కరోనా పరీక్షల కోసం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న కోవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ఆర్‌ఎక్స్‌ 100 సినీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు.

సినిమాల్లో నటించాలని..

సినిమాల్లో నటించాలని..

కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన శ్రావణి.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అశోక్ రెడ్డిని పరిచయం చేశాడు. ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాలో శ్రావణికి చిన్న రోల్ కూడా ఇప్పించారు. అలా శ్రావణతో సాయి పరిచయం కొనసాగింది. తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ అవకాశం రావడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆమె పేరంట్స్, బ్రదర్ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారితో కూడా సాయికి పరిచయం ఏర్పడటంతో.. క్రమంగా ఇంటికి కూడా వచ్చేవాడు.

దేవరాజ్ రెడ్డి ఆగమనం..

దేవరాజ్ రెడ్డి ఆగమనం..

గతేడాది టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ పరిచయం అయ్యాడు. అయితే వారి ప్రాంతం కావడంతో.. శ్రావణి అతనితో చనువుగా ఉంటేంది. కొద్దిరోజులు ఆమె ఇంట్లో కూడా ఆశ్రయం కల్పించింది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం.. సాయికి నచ్చలేదు. గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరడంతో.. దేవరాజ్ శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ నెల 7వ తేదీన కూడా ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసే సమయంలో సాయి వారి వద్దకు వచ్చారు. దేవరాజ్‌తో సాయి గొడవపడి.. శ్రావణిని అక్కడినుంచి తీసుకెళ్లారు.

  Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
  రెస్టారెంట్ నుంచి ఇంటికెళ్లి..

  రెస్టారెంట్ నుంచి ఇంటికెళ్లి..

  ఆ రోజు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిచారని, దాడి చేశారని శ్రావణి పేర్కొన్న సంగతి తెలిసిందే. శ్రావణి ఆడియో రికార్డును దేవరాజ్ పోలీసులకు అందజేశాడు. దేవరాజ్, సాయిని విచారించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్యకు కారణం ఇద్దరు అని నిర్ధారణకు వచ్చారు. వారిని రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను కూడా విచారిస్తామని పోలీసులు చెబుతుండగా.. ఆయన పరారీలో ఉన్నారు.

  English summary
  sravani suicide case:devraj reddy, sai krishna reddy is reason police suspects.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X