crackers fire:పిల్లలను ఒంటరిగా వదలొద్దు, దగ్గరలో ఉండాలంటోన్న వైద్యులు
దేశవ్యాప్తంగా దివాళి సందడి నెలకొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. కొత్త బట్టలు ధరించి పూజ చేస్తోన్నారు. ఆ తర్వాత ఘట్టం పటాకులు పేల్చడమే. అయితే అవీ కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల పేరంట్స్/ పెద్ద వారు తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. వారి వెంటే ఉండాలి.
చిన్న పిల్లలు బాణాసంచా కాల్చే సమయంలో పేరంట్స్ తప్పనిసరిగా వారి దగ్గర ఉండాలి. వారికి రక్షణ కవచాలు ధరింపజేయాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.లేదంటే టపాసులు కాల్చే సమయంలో నిప్పురవ్వలు మీదపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చేతిలో పట్టుకొని టపాసులు వెలిగించొద్దని కోరుతున్నారు.

వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా కొంతసేపు ఆగి వెళ్లాలని అంటున్నారు. సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండవంటి పాత్రల్లో పెట్టి టపాకాయలను వెలిగించవద్దని కోరారు. క్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్, వదులుగా ఉన్న దుస్తులు కాకుండా మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించాలని సూచించారు.
బాణసంచా కాల్చే సమయంలో కంటికి రక్షణగా కళ్లద్దాలను ధరించాలని.. టపాసులను ముఖాన్ని దగ్గరగా ఉంచొద్దని కోరారు. ఒకవేళ గాయపడితే కాలినచోట క్రీమ్, ఆయింట్ మెంట్ , నూనె పూయొద్దని.. వైద్య సహాయం తీసుకోవాలని కోరుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని.. హ్యాపీగా దీపావళి పండగ జరుపుకోవాలని కోరుతున్నారు.