Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకున్న ఐదుగురు.. హైడ్రాకు షాక్!

మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను ఈరోజు తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 26 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు పరిధిలోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన షెడ్లు, భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలపర్వం కొనసాగుతుండగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మాదాపూర్ లో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు
నేడు హైడ్రా అధికారులు మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీనాపూర్ లలో ఏకకాలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారుల తీరుపైన భవన నిర్మాణాలు చేసుకున్న యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు.

Tension in Madapur five people poured kerosene and tried for suicide shock for hydra

ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు
దీంతో కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని బెదిరించారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుంటామని... అధికారులను హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. తాము పిల్లాపాపలతో ఉన్నాం ఎక్కడికి వెళ్లాలంటూ వారు గగ్గోలు పెట్టారు. తమ నివాసాలను కూల్చి వేయకూడదని, అక్కడి నివాసితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పర్మిషన్లు వచ్చాకే ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ వేడుకోలు
తమకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతనే ఇంటి నిర్మాణాలు చేపట్టామని ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులను, డబ్బున్న వాళ్ళని వదిలేసి పేదవాళ్లపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని వారు అసహనం వ్యక్తం చేశారు.

ఇళ్ళ కూల్చివేతలపై హైడ్రా చెప్తుందిదే.. సామాన్యులు కన్నీరు
మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇటు సామాన్యులకు సైతం షాక్ ఇస్తున్నాయి. అయితే హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నివాసాలు ఏర్పరచుకొని వాటిని కమర్షియల్ గా వినియోగిస్తున్న వాటిపైన చర్యలు తీసుకుంటున్నామని అలాగే కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు, నిర్మాణ దశలో ఉన్న వాటిపైనే చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం సామాన్య ప్రజల ఇళ్ళ కూల్చివేతలకు హైడ్రా పాల్పడుతోందని, తమకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+