హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబులకు షాక్: రెండురోజులు వైన్స్ బంద్.. మళ్లీ ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

హోళి.. ఈ సారి గురు, శుక్రవారాల్లో ఉంది. కానీ హాలీడే మాత్రం శుక్రవారం ఇచ్చారు. హోలీ వేడుక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప‌రిధిలో ప‌లు ఆంక్ష‌లు అమ‌ల్లోకి వచ్చాయి. మందు బాబుల‌కు రెండు రోజుల పాటు ప‌స్తులు త‌ప్ప‌ద‌ు. హోలీ వేడుక‌ నేపథ్యంలో సిటీలో రెండు రోజుల పాటు మ‌ద్యం విక్ర‌యాలు నిలిచిపోనున్నాయి. బార్లు, క్ల‌బ్బులు కూడా మూతప‌డ‌నున్నాయి. న‌గ‌ర పోలీసులు నిషేధాజ్ఞ‌ల‌ను ప్ర‌క‌టించారు.

గురువారం ఉద‌యం 6 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం విక్ర‌యాలు నిలిచిపోనునున్నాయి. అదే స‌మ‌యంలో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసే బార్లు, క్ల‌బ్బులు కూడా మూత‌ప‌డ‌నున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో హోలీ వేడుక‌ల‌ను పోలీసులు నిషేధించారు. అప‌రిచిత వ్య‌క్తులు, వాహ‌నాలు, భ‌వ‌నాల‌పై రంగులు పోయ‌డాన్ని కూడా పోలీసులు నిషేధించారు.

wine shops two days close at hyderabad

మిగిలిన ఆంక్ష‌ల మాట ఎలా ఉన్నా.. రెండు రోజుల పాటు మ‌ద్యం విక్ర‌యాలు నిలిచిపోనున్నాయి. ఈ వార్త క్ష‌ణాల్లో న‌గ‌ర‌మంతా వ్యాపించింది. దీంతో రెండు రోజుల‌కు స‌రిప‌డా మ‌ద్యం కోసం మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ క‌ట్టారు. ఫ‌లితంగా న‌గ‌రంలోని దాదాపుగా అన్ని వైన్ షాపుల వ‌ద్ద భారీ ర‌ద్దీ నెల‌కొంది. అయితే ఇల్లీగల్‌గా మద్యం మాత్రం లభించనుంది. కానీ వినియోగదారుల నుంచి మాత్రం వారు అధిక మొత్తంలో వసూల్ చేస్తారు.

Recommended Video

Analysis On Revanth Reddy Kollapur Rally రేవంత్ చరిష్మా కాంగ్రెస్ ని కాపాడుతుందా ?| Oneindia Telugu

ఇప్పుడే కాదు ఏటా హోళి సందర్భంగా వైన్స్ మూసివేస్తారు. బోనాల పండగ రోజున కూడా అలానే బంద్ ఉంటుంది. మద్యం సేవించి గొడవ చేస్తారనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా సిటీలో ఇలా ఆంక్షలు విధిస్తున్నారు. అధిక ధరకు మద్యం కొనుగోలు చేయలేని వాళ్లు.. ముందుగా మందు దాచి పెట్టని వారు మాత్రం.. కాస్త ఇబ్బంది పడక తప్పని పరిస్థితి నెలకొంది.

English summary
wine shops two days close at hyderabad due to holy festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X