వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్నటి దాకా ముఖ్యమంత్రి, సాధారణ వ్యక్తిలా స్లీపర్ క్లాస్‌లో ఇలా..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మాజీ ముఖ్యమంత్రి స్లీపర్ క్లాస్ కంపార్టుమెంటులో సాధారణ పౌరుడిలా ప్రయాణించాడు. ఈ సంఘటన కేరళలో సోమవారం నాడు జరిగింది. మామూల వ్యక్తిలా పడుకున్న అతనిని తోటి ప్రయాణీకులు ఎవరు కూడా మొదట గుర్తించలేదు.

కానీ ఆ తర్వాత గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి సాధారణ పౌరుడిలా ప్రయాణించడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రయాణం చేసింది.. మాజీ సీఎం ఊమెన్ చాందీ. ఆయన సోమవారం నాడు స్లీపర్ క్లాస్‌లో తిరువనంతపురం వరకు 160 కిలో మీటర్ల మేర ప్రయాణించారు.

ఇప్పుడు ఈ వార్త మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఆయన పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన సాధారణ ప్రయాణం పైన ఊమెన్ చాందీ స్పందించారు. తనకు స్లీపర్‌ క్లాస్‌లో వెళ్లటమంటే చాలా ఇష్టమని, పెద్దగా రద్దీ ఉండదని, దూర ప్రయాణాలకు ఇది బాగుంటుందని, తనకు ప్రజలతో కలిసి వెళ్లటమంటే ఇష్టమని, లేకుంటే ఒంటరిగా ఉన్నట్లుగా భావిస్తానని, తనకు వీఐపీ ట్రీట్‌మెంట్‌పై నమ్మకం లేదన్నారు.

కాగా, ఈ ఏడాది మేలో ఆయన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వారం రోజులకే ఆయన కొల్లాం నుంచి తిరువనంతపురం బస్సులో ప్రయాణించారు. ఓ రాజకీయ సమావేశానికి రైలు టిక్కెట్లు లభించక పోవడంతో బస్సులో ప్రయాణించారు.

English summary
Reclining, and then stretched out on a berth in the slepper-class compartment of a train, Oommen Chandy is the very picture of a political outlier. The former Chief Minister of Kerala travelled no-frills on Monday on a train journey that lasted 160 kms and ended in the capital of Thiruvananthapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X