నోట్ల రద్దు ఎఫెక్ట్: బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
  PM Modi's Notes Ban After A Year : What's Changed

  ముంబై: పెద్ద నగదు నోట్లను రద్దు చేసి నవంబర్ 8వ, తేదికి ఏడాది పూర్తికానుంది. నోట్లరద్దు వల్ల దేశానికి పెద్దగా ప్రయోజనం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తమకు ప్రయోజనం కలిగిందని బ్యాంకులు ప్రకటించాయి.

  గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నోట్ల నగదును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు ఆ సమయంలోనే తప్పుబట్టాయి.పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇక్కట్లపాలయ్యారు.

  అయితే అదే సమయంలో దేశాభివృద్ది కోసమే పెద్ద నోట్లను రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

   నోట్ల రద్దుతో బ్యాంకులకు మంచి రోజులు

  నోట్ల రద్దుతో బ్యాంకులకు మంచి రోజులు

  నోట్ల రద్దు కారణంగా బ్యాంకులకు ప్రయోజనం కలిగిందని భ్యాంకర్లు ప్రకటించాయి. పెద్ద నోట్ల రద్దు తమకు మంచే చేసిందని చెప్పారు.డిపాజిట్లు భారీగా పెరుగడంతో పాటు డిజిటలైజేషన్‌ చాలా వేగవంతంగా విస్తరించేలా చేసిందని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు.

   బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు

  బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు

  గతేడాది నవంబర్‌ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్‌మనీ, అవినీతి నిర్మూలనకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో అధికారికంగా బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి చాలా నగదు వచ్చి చేరింది. ఇది బ్యాంకింగ్‌ రంగానికి మంచి పరిణామమని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

   కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు పెరిగాయి

  కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు పెరిగాయి

  కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌ డిపాజిట్లు కనీసం 250-300 బేసిస్‌లో పెరిగాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు ప్రకటించారు. పెద్ద నోట్ల నగదు రద్దు అనేది మాకు చాలా పెద్ద సానుకూలమైన విషయమని అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ రంగంలోకి వచ్చిన డిపాజిట్లు ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫండ్స్‌ పెరిగాయని బ్యాంకర్లు ప్రకటించారు.

  మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో నిధులు పెరిగాయి

  మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో నిధులు పెరిగాయి

  పెద్ద నోట్ల రద్దుతో అధికారిక ఫైనాన్సియల్‌ సేవింగ్స్‌ పెరిగాయని, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌లోకి ఫండ్స్‌ వెల్లువ ఎగిసిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చందా కొచ్చర్‌ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్‌ చాలా వేగవంతంగా విస్తరించదన్నారు. నోట్ల రద్దు విషయమై కేంద్రం తీసుకొన్న నిర్ణయం బ్యాంకులకు కలిసివచ్చిందని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A couple of days ahead of the first anniversary of demonetisation, bankers said on Monday that the move was good for them as it resulted in higher deposits and pushed digitisation at a faster pace.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి