ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీం కోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయవద్దని సుప్రీం కోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానంపై కోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది.

ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేయకూడదని చెప్పింది. అయితే బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను వివరాల నమోదు లాంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఆధార్‌ను తొలగించబోదని కోర్టు వెల్లడించింది.

Aadhaar cant be mandatory for government schemes: SC

ఆధార్‌ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని తెలిపింది.

కాగా, అక్రమాలను తొలగించడానికి అన్ని సంక్షేమ పథకాలకు కేంద్రం ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలని చూసినప్పటికీ.. సుప్రీం కోర్టులో మాత్రం షాక్ తగిలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Aadhaar card cannot be made mandatory by the government to give out benefits from its welfare schemes, the Supreme Court has observed. The court however added that the government cannot be stopped from making it mandatory for opening bank accounts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X