వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: అర్థంలేదన్న సుప్రీం కోర్టు: బడ్జెట్ వాయిదా పిల్ కొట్టివేత

ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌కు లైన్ క్లియర్ అయింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ ముందే బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా చూడాలని వేసిన పిల్‌ను సోమవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌కు లైన్ క్లియర్ అయింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ ముందే బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా చూడాలని వేసిన పిల్‌ను సోమవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిల్‌లో అర్థం లేదని సుప్రీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Absurd: SC says while rejecting plea to delay Union Budget

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.

హల్వా వండిన జైట్లీ, వందమందికి పైగా అధికారులను లాక్ చేశారు!

పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయవాది ఎంఎల్‌ శర్మ తన వాదనలను వినిపించారు. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించే హామీలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎలాంటి హామీలు, ప్రజాకర్షక పథకాలను ప్రకటించరాదన్నారు. ఎన్నికలు ముగిశాక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని కోరారు.

బడ్జెట్‌ కారణంగా రాష్ట్రాలు చేసేదేమీ ఉండబోదని జడ్జి చెప్పారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేంద్రం పనిని అడ్డుకునే వీలు లేదని చెవ్పారు. ఏడాది పొడవునా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, అంతమాత్రాన బడ్జెట్‌ ప్రవేశ పెట్టవద్దా అని అడిగారు. కాగా, బడ్జెట్‌ను ఫిబ్రవరి 6న ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది.

English summary
The Supreme Court rejected a plea seeking to delay the Union Budget to be presented on February 1. The plea sought postponement of the Budget on the ground that five state were going to polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X