అర్థరాత్రి.. బుల్లితెర నటిపై దుండగుల లైంగిక వేధింపులు!

కోల్‌కతాలో ఓ బుల్లితెర నటిపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తిచేసుకుని బెహలా లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఓ బుల్లితెర నటిపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తిచేసుకుని బెహలా లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

ఆమె పై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో సిరితి క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది.

Actress allegedly molested in Kolkata while returning from shooting, two held

మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై అడ్డంగా నిలబడి బాధితురాలి కారును అటకాయించారు. వారిలో ఒక వ్యక్తి ఆమెను నిలిపివేసి, ఆమె కారు తాళాలు లాగేసుకున్నాడు.

అనంతరం ఆమెను కారులోంచి బయటికి లాగి అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డారు. ఎలాగో వారినుంచి తప్పించుకున్న బాధితురాలు బెహాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సదరు బుల్లితెర నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె పై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని బెహలా డిప్యూటీ కమిసనర్ మీరజ్ ఖాలిద్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+