• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతర్జాతీయ స్ధాయిలో అడ్మిషన్ల వేదిక- అడ్మిట్‌ నెక్ట్స్‌ సొల్యూషన్‌ ప్రారంభం

|

జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్ధల్లో అడ్మిషన్ల కోసం విద్యార్ధులు ఎక్కడెక్కడో వెతుక్కోకుండా, ఈ ప్రక్రియను సులభతరం చేసేలా వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే అడ్మిన్‌ నెక్ట్స్‌ సొల్యూషన్ ఇవాళ ప్రారంభమైంది. ఇందులోనే విద్యార్ధులు, విద్యా సంస్ధలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. తద్వారా విద్యార్ధులకు సులువుగా ఆడ్మిషన్లు పొందేందుకు వీలు లభిస్తోంది.

ప్రస్తుతం విద్యార్ధులే కాదు, విద్యాసంస్ధలు సైతం అడ్మిషన్ల విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ వద్ద అత్యుత్తమ నాణ్యత కలిగిన విద్యాబోధన కలిగి ఉన్నప్పటికీ విద్యార్ధులకు దాన్ని చేరవేసి అడ్మిషన్ల వరకూ రప్పించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో విద్యార్ధులకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజన్స్ విధానంలో అభివృద్ధి చేసిన వన్‌ స్టాప్‌ సొల్యూషన్ల అవసరం ఏర్పడింది. దీంతో విద్యాసంస్దలకు అడ్మిషన్ల ప్రక్రియలో రిస్క్ దాదాపుగా తగ్గిపోవడంతో పాటు విలువైన సమయం కూడా ఆదా కానుంది.

AdmitNXT to revolutionise the admission process in India

ముఖ్యంగా ఈ అడ్మిన్‌ నెక్ట్స్‌లో విద్యార్ధులు తమకు కావాల్సిన సమయంలో అడ్మిషన్ అప్లికేషన్‌ తీసుకుని భర్తీ చేసి పంపవచ్చు. ఓసారి అప్లికేషన్‌ పంపిన తర్వాత దానికి సంబందించిన ప్రతీ అప్‌డేట్ అందుబాటులోకి వస్తుంది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ వారికి సునాయాసంగా మారిపోతుంది. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. గ్రామాల్లో సైతం విద్యార్ధులు ఇంటర్నెట్ వాడుతూ ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులు కేవలం అడ్మిషన్ల కోసమే కాలేజీల వరకూ వెళ్లకుండా అడ్మిన్‌ నెక్ట్స్‌ ద్వారా వివరాలు పొందే అవకాశం ఉంటుంది.

అడ్మిన్‌ నెక్ట్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఈవో, సహ వ్యవస్దాపకురాలు అయిన నికితా శివకుమార్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు డిజిటల్‌గా వెళుతున్నప్పుడు, సంస్థలు తమను తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అడ్మిట్‌ ఎన్‌ఎక్స్‌టిని పరిచయం చేయడం వెనుక ఉన్న ఆలోచన అందరికీ అనుభవాన్ని పెంచే సమగ్ర పరిష్కారాన్ని అందించడం. విద్యాసంస్థల కోసం అనువర్తన సంక్లిష్టతలను తగ్గించడానికి వినియోగదారులు, డేటా అంతరాన్ని తగ్గిస్తుంది మరియు మొత్తం ప్రక్రియను సులభతరం చేస్తుంది. అక్కడ చాలా కళాశాలలు మరియు పాఠశాలలు ఉన్నాయని మేము చూశాము, వారు ఉపయోగించడానికి సులభమైన, వారి అవసరాలను తీర్చగల పరిష్కారం నుండి ప్రయోజనం పొందగలరు మరియు ఎలా మెరుగుపరచాలనే దానిపై ఆలోచనలను సూచించడానికి పనిచేస్తుంది.' అన్నారు.

AdmitNXT to revolutionise the admission process in India

సహ వ్యవస్థాపకురాలు మరియు సీఓఓ నటాషా రావు మాట్లాడుతూ, అడ్మిషన్ల ప్రక్రియలో భాగస్వాములైన అందరినీ పేపర్‌ లెస్‌ విధానంలో ఒకే చోటికి చేర్చడమే కాకుండా మెరుగైన, సులభమైన పద్దతుల్లో వారికి సాయం చేసేందుకే ఈ అప్లికేషన్ ప్రారంభిస్తున్నాం.మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడంతో సంస్ధలు సైతం వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా దీన్ని ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుందని చెప్పారు.

English summary
AdmitNXT, an AI First Admissions Solution is launched to cater to educational institutions around the world. This solution is a strategic response to the market's demand to enhance, organise and centralise the entire admission process. Within a single system, this platform manages all student data efficiently, provides actionable insights, and allows for better, data driven decision making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X