వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేగంగా ‘మైసయ్య’ మోదీ ఇమేజ్ పతనం: నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా?

అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రధాని మోదీ చేసిన బాసలు ఆచరణలో అమలుకు నోచుకుంటున్నట్లు కనిపించడంలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షా వ్యాపారాల టర్నోవర్ మూడేళ్లలో 16 వేల రెట్లు పెరగడం ప్రధా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడున్నరేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల నుంచి పొందిన విశ్వాసం, ఆదరణ అతి వేగంగా పడిపోతున్నది. 2014 మేలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 67 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేకుండా ఎలా దేశం మనుగడ సాగించిందో ఊహించలేక పోతున్నామని ఆయనపై యావత్ జాతీయ మీడియా అనూహ్య రీతిలో ఆరాధన పెంచుకున్నది. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మారుమూల గ్రామంలోని హైస్కూల్‌లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ హాజరైన బహిరంగ సభ అయినా, ఢిల్లీ కాలేజీలో ఇష్టాగోష్టి సమావేశమైనా ప్రధాన వార్తగా మారింది. మీడియా సంస్థలు ఇతర జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలనూ పక్కనబెట్టేసి నామస్మరణ చేసేశాయి. ప్రధాని మోదీ నామస్మరణ చేస్తూనే మంచి, చెడు తేడా లేకుండా ప్రతి రోజూ 18 గంటల పాటు వార్తా పత్రికలు, చానెళ్ల కార్యక్రమాలు సాగాయి. ఇక సోషల్ మీడియా సంగతి సరేసరి. ఆయన పట్ల సానుకూలత ప్రదర్శిస్తూ స్తోత్ర గీతాలు పాడాయి ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలు. భారతీయుల కష్టాలన్నీ తీర్చే మైసయ్య అని భుజకీర్తులు తొడిగాయి.
ఇక 'మైసయ్య' అవతారం ఎత్తిన ప్రధాని మోదీ తనకు తాను అవతార మూర్తిగా చేసుకుని తన సభలకు హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో పాలకులు మీకేం చేశారని ప్రశ్నిస్తే శూన్యమని జవాబు తెప్పించారు. వచ్చే 60 నెలల్లో స్వర్ణ యుగాన్ని, 'అచ్ఛేదిన్' తీసుకొస్తానని హామీలు గుప్పించారు. దేశంలోని ఓటర్లలో 31 శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటే 21 నుంచి 22 శాతం మంది ఓట్లతో అంటే భారతీయుల్లో 12 శాతం మంది పౌరులు ఆయన నర్మగర్భ వ్యాఖ్యలకు పడిపోయి ప్రధానిని చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో ఓటు వేశారు.

ఇందిర ‘ఎమర్జెన్స’ హయాంలోనూ ఇలా

ఇందిర ‘ఎమర్జెన్స’ హయాంలోనూ ఇలా

కానీ సమస్యలన్నీ తీర్చే మైసయ్యగా ప్రధాని మోదీ తాను ఇచ్చిన హామీలేవీ అమలు చేయనందుకు ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తుతున్నది. హేళనతో కూడిన వ్యాఖ్యలు నిత్యక్రుత్యం అయ్యాయి. ఆయన సహచర క్యాబినెట్ మంత్రి ఉమా భారతి ఇంతకుముందు పేర్కొన్నట్లు ‘వికాస్ పురుష్' అనే ఇమేజ్ క్రమంగా ‘వినాశ్ పురుష్'గా మారిపోయిందని మూడున్నరేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రసంగాలపై వీడియో క్లిప్పింగ్‌లు, ధైర్యవంతమైన హామీలను గుర్తుచేస్తూ వ్యాఖ్యలు ప్రారంభం అయ్యాయి. సోవియట్‌లో సంస్కరణలు 1980వ దశకంలో పతాక స్థాయికి చేరాయి. అంతకుముందు 1975 - 77 మధ్య ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితుల్లోనూ వ్యక్తి ఆరాధన తీరు పెరిగిపోయింది. రూమర్లు కూడా ఆరాధన పెంచేశాయి.

ప్రభుత్వ వైఫల్యాలను కడిగి పారేసిన యశ్వంత్ సిన్హా

ప్రభుత్వ వైఫల్యాలను కడిగి పారేసిన యశ్వంత్ సిన్హా

ప్రధాని మోదీ ఇచ్చిన అతి పెద్ద హామీలు కూలిపోయాయి. అట్టహాసంగా ప్రారంభించిన పథకాల అమలు తీరు ఫేలవంగా సాగింది. దీనికి తోడు ప్రయోగాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు విపత్తుగా పరిణమించింది. నోట్ల రద్దుతో ప్రజలు, వ్యాపారులు పలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ‘గోటిపై రోకటి పోటు' మాదిరిగా అహంకారంగా అమలులోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో పరిస్థితి మరింత దిగజారింది. స్వర్ణ భారతాన్ని ఆవిష్కరిస్తామని ఇచ్చిన హామీలన్నీ కేవలం మూడున్నరేళ్ల కాలంలోనే క్షీణించిపోవడం అత్యంత ఇబ్బందికర పరిణామం. గతంలో ప్రధానులు తమ పార్టీల్లో గ్రూపులు, అసంబద్ధ సంకీర్ణాల వల్ల త్వరగా అప్రతిష్ట పాలైతే.. ఈ దఫా అటువంటి సారుప్యతలేమీ కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఏకవ్యక్తి పాలనతో శరవేగంగా ఆయనకు ఉన్న ప్రజాదరణ క్రమంగానూ, వేగంగానూ పడిపోతున్నది. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యాలను తొలిసారిగా బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కడిగి పారేశారు.

అమిత్ షా తనయుడిపై ఆరోపణలకు మోదీ పారదర్శకతకు గొడ్డలిపెట్టు

అమిత్ షా తనయుడిపై ఆరోపణలకు మోదీ పారదర్శకతకు గొడ్డలిపెట్టు

గుజరాత్ అసెంబ్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అహ్మద్ పటేల్ ఎన్నిక కాకుండా అడ్డుకునేందుకు బీజేపీ తన వనరులన్నీ ఉపయోగించినా ప్రయోజనం లేకపోయినా నిష్ర్పయోజనమైంది. ఒకటి తర్వాత మరొక యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ‘ఏబీవీపీ' ఓటమి పాలు కావడం యువతలో ఆ పార్టీ, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ పట్టు, ఆదరణ కోల్పోతున్న వైనాన్ని పట్టిస్తుంది. తాజాగా పంజాబ్‌లో మూడుసార్లు వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించిన గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ‘బీజేపీ అధ్యక్షుడు' అమిత్ షా మాటల్లో ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం పరిస్థితిలో వచ్చిన మార్పును తెలియజేస్తున్నది. దీంతోపాటు అమిత్ షా తనయుడు జయ్ అమిత్ భాయి షా వ్యాపార లావాదేవీల్లో అసాధారణ టర్నోవర్ నమోదు కావడం ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ హామీ మట్టికొట్టుకుపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతులు, వ్యాపారుల సమస్యలను పట్టించుకోవాలని ఆరెస్సెస్ సూచన

రైతులు, వ్యాపారుల సమస్యలను పట్టించుకోవాలని ఆరెస్సెస్ సూచన

తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేతలకు ప్రజల హాజరు పలుచగా ఉండటం పరిస్థితిలో మార్పును తెలియజేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి ‘వికాస్' నినాదంతోపాటు మరేదో హామీ ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ దశమి సందర్బంగా ఆరెస్సెస్ సమ్మేళనంలో సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ తదుపరి ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను దిశా నిర్దేశం చేశారు. చిన్న, సన్నకారు రైతులు, మధ్య, చిన్న తరహా వ్యాపారుల ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకోవాలని కోరారు. అదే సమయంలో ఆయా రంగాల్లో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనూ అంగీకరించినట్లయింది.

మళ్లీ ఆందోళనకు అన్నా హజారే హెచ్చరిక ఇలా

మళ్లీ ఆందోళనకు అన్నా హజారే హెచ్చరిక ఇలా

మయన్మార్ రాకతో రోహింగ్యాల రాకతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడం ద్వారా దేశానికి ముస్లింలతోనే ముప్పు అన్న సంకేతాలనిచ్చింది. పాకిస్థాన్‌తో నిరంతర ఘర్షణతో హిందువులను ఐక్యపరిచి విజయం సాధించాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అవినీతిని అంతమొందించేందుకు లోక్ పాల్' వ్యవస్థ కోసం మరోసారి పోరాడుతామని సామాజిక కార్యకర్త అన్నా హాజారే.. ఈ నెల రెండో తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వ్యాఖ్యానించడం పరిస్థితుల్లో మార్పులను తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు సంఘ్ పరివార్ అంతరాన్ని పూడ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2004కి ముందు భారత్ వెలిగి పోతోంది అన్న నినాదాన్ని అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం భారీగా ప్రచార హోరు సాగించినా ఓటమి పాలైంది. తాజాగా ‘నవ్య భారత్' అనే నినాదంతో మోదీ సర్కార్ ముందుకు సాగుతున్నది. 2004లోనూ విపక్షాల పరిస్థితి దారుణంగానే ఉన్నది. నాడు పరిపాలన, విదేశాంగ విధానంలోనూ అప్పటి ప్రధాని వాజ్ పేయి పేరు తెచ్చుకున్నా అట్టహాసంతో కూడిన ప్రచారం అధికారానికి దూరం చేస్తున్నదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Remember the year or so prior to the May 2014 elections? The adoring Indian media could not imagine how the country had survived without Narendra Modi for 67 long years. Every little speech of his in a remote high school or a Delhi college became the news, wiping out all other national or international events – good, bad or indifferent – for a day-and-a-half from TV screens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X