వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు స్కామ్: సీబీఐ డైరెక్టర్ రాత్రుళ్లు ఏకాంత భేటీలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యావత్ భారత్ దేశాన్ని నివ్వెరపరిచిన కుంభకోణం బొగ్గు కుంభకోణం. అలాంటి బోగ్గు కుంభకోణం నుండి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను దూరంగా ఉంచాలని కామన్ రాజ్ అనే స్వచ్చంద సంస్ద సుప్రీంకోర్టును గురువారం కోరింది. 2జీ, 4జీ , బొగ్గు కుంభకోణాల కేసుల్లోని నిందితులు పలువురు రంజిత్ నిన్హాను ఆయన నివాసంలో కలుసుకుంటున్నారని, ఆయన ఇతర అధికారులెవ్వరూ లేకుండా రాత్రుళ్లు ఆలస్యంగా వారితో ఏకాంతంగా మాట్లాడుతూన్నారని ఆరోపించింది.

ఎవరెవరితో సమావేశమయ్యారనే వివరాలు ఆయన నివాసంలోని లాగ్ బుక్‌లో ఉన్నాయని పేర్కొంటూ ఆ పుస్తకాన్ని కోర్టుకు సమర్పించింది. ఆ లాగ్ బుక్‌లో ఉన్నవారంతా ప్రభావపూరిత వ్యక్తులని వెల్లిడించింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సిన్హాను దూరంగా ఉంచాల్సిందేనని పేర్కొంది. 'సిన్హా.. కేంద్రమాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్‌తో కూడా భేటీ అయ్యారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో లభ్ది పొందిన వాటిల్లో మంత్రి సోదరుడి కంపెనీ కూడా ఒకటి' అని కామన్ రాజ్ దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది.

Allegations of impropriety against CBI Director Ranjit Sinha

స్వచ్చంద సంస్ద తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు. లాగ్ బుక్‌లో నమోదయ్యే సందర్సకుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై మీడియాలో కథనాలు వచ్చాయని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. అసలు అలాంటి పుస్తకమే లేదని ఒకసారి, అందులోని నమోదైన కొన్ని వివరాలు నిజమేనని, కొన్ని మాత్రం ఫోర్జరీ చేసినవి అంటూ రంజిత్ సిన్హా అన్నారని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందుతలతో భేటీ ఐతే తప్పేంటని మరోసారి అన్నారని చెప్పారు.

లాగ్ బుక్ లో నమోదైన వివరాలకు సంబంధించిన కథనాలను మీడియా వెలువరించకుండా నిరోధించాలని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తి చేయగా సుప్రీం కోర్టు కొట్టేసింది. మీడియాపై మాకు నియంత్రణ లేదు అని జస్టిస్ హెచ్. ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. సందర్సకుల వివరాల నమోదు పుస్తకం విషయం చాలా సున్నితమైంది.. ఆ విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్వవహారించగలదనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక తనపై వచ్చిన ఆరోపణనలపై రంజిత్ సిన్హా స్పందిస్తూ సూప్రీం కోర్టు ఆదేశిస్తే బొగ్గు కుంభకోణం దర్యాప్తునకు దూరంగా ఉంటానన్నారు.

English summary
The head of India's top investigating agency, fighting allegations of impropriety in the Supreme Court, had to put up with the airing of details about his domestic arrangements and was unable to persuade judges to impose a gag order on the media reporting details of entries in his visitors' book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X