వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ తొలి మహిళా సిఎంగా రికార్డ్: ఆనందీ ప్రమాణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కమలాబేనీ వాల్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ చరిత్ర సృష్టించారు. అటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

ఆనందీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనందీ బెన్ పటేల్.. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

నరేంద్ర మోడీ వారసురాలిగా 73 ఏళ్ల ఆనందీ బెన్ పటేల్ గురువారం మధ్యాహ్నం గుజరాత్ 15వ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

ఓ రైతు కూతురిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినందుకు మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆనందీ బెన్ పటేల్ బుధవారం తనను నేతగా ఎన్నుకున్న సమయంలో వ్యాఖ్యానించారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

శాసనసభాపక్ష సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే సమయంలో ఆమె గొంతు ఆనందంతో మూగబోయింది. కళ్లు ఆనందభాష్పాలను వర్షించాయి. మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆనాటి కృష్ణుడు యమునాతీరాన్ని వీడి ఇక్కడికి వస్తే.. నేడు లోకనాయకుడు మోడీ సబర్మతీ తీరం నుంచి యమునాతీరానికి వెళుతున్నారని పేర్కొన్నారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

ఆది నుంచీ ఆనందీ బెన్ పటేల్ మోడీ సహచరురాలిగా పేరొందారు. పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా మోడీ రాష్ట్రానికి దూరంగా ఉన్నా ఆమె తన విశ్వసనీయతను మార్చుకోలేదు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

దీంతో మోడీకి నమ్మినబంటుగా ఆమె ప్రచారంలోకి వచ్చారు. మోడీ అధికారపగ్గాలు స్వీకరించగానే ఆమెకు ఉన్నతస్థానం కట్టబెట్టారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

ఇటీవల లోకసభ ప్రచారంలో మోడీ తలమునకలై ఉండగా రాష్ట్ర పాలనను ఆనందిబెన్ పర్యవేక్షించేవారు. గుజరాత్ రాజకీయాల్లో మోడీ కుడిఎడమలుగా అమిత్‌షా.. ఆనందీ బెన్‌లను అభివర్ణిస్తుంటారు.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

సామాజిక సమీకరణాలూ అనందీ బెన్ పటేల్‌కు కలిసొచ్చాయి. రాష్ట్రంలో పటేల్ సామాజికవర్గం అతిపెద్దది.. రాజకీయంగా కీలకమైనది.

ఆనందీ బెన్ పటేల్

ఆనందీ బెన్ పటేల్

ఎమ్మెస్సీ గోల్డ్‌మెడలిస్ట్ అయిన ఆనందీ బెన్ పటేల్ ప్రొఫెసర్ మఫత్‌భాయ్ పటేల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. అయితే, 1990ల్లోనే ఆమె కుటుంబం నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు. మఫత్‌భాయ్ ఇటీవల లోకసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా, చివరకు కొడుకు, కూతురు ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గారు. తాజాగా భార్య ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన తన విదేశీ ప్రయాణాన్నీ వాయిదా వేసుకున్నారు.

English summary
Anandiben Patel takes oath as the Chief Minister of Gujarat at Mahtma Mandir, Gandhinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X