
కాంగ్రెస్ చీఫ్‌గా అశోక్ గెహ్లట్..?, పైలట్‌కు సీఎం పోస్టు, సోనియా లెక్క ఇదీ
వయసు మీద పడటం.. అనారోగ్య సమస్యలతో కాంగ్రెస్ పార్టీని సోనియా లీడ్ చేయలేకపోతున్నారు. అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ ఆమడదూరంలో ఉంటున్నారు. మధ్యేమార్గంగా.. ఎవరికీ పగ్గాలు అప్పగించాలని పార్టీ అనుకుంటుంది. ఇదివరకు కూడా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా తెరపైకి అశోక్ గెహ్లాట్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన గాంధీ కుటుంబానికి వీర విధేయుడు.. సోనియా గాంధీకి నమ్మినబంటు.. అందుకే ఆయనకు ఇవ్వాలని అనుకుంటున్నారట.

కేసీ వేణుగోపాల్..?
గెహ్లట్ రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో సోనియా ఉన్నారట. దీంతో ఆమెకు విశ్రాంతి లభించడంతోపాటు.. పార్టీ బలోపేతం అవుతుందని. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్.. ఇతరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అవీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు గెహ్లట్ పేరు ముందువరసలో ఉంది. ఎందుకంటే.. ఆయన సోనియాకు నమ్మిన బంటు.. సచిన్ పైలట్‌ను కాదని గెహ్లాట్‌ను సీఎం చేశారు. ఓ క్రమంలో పైలట్ తిరుగబాటు చేసినా.. ఆ సమస్యను కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది.

వన్ షాట్ టు బర్డ్స్
అదే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. సోనియాకు గెహ్లట్‌ను మించిన వారు లేరు. దీంతోపాటు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సచిన్ పైలట్ ఎప్పుడెప్పెడు తిరుగుబాటు చేయాలా అని అనుకుంటున్నారు. గెహ్లట్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. సీఎం పోస్టు పైలట్‌కు దక్కుతుంది. దీంతో రెండు సమస్యలు తీరతాయని పార్టీ భావనలో ఉంది. దాంతో తమ పార్టీ బలోపేతానికి బీజం పడుతుందని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది.

రాహుల్ మనసు మారితే..
ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే ఫీవర్ ఉంది. పార్టీని గెహ్లట్ బలోపేతం చేస్తారని సోనియా అనుకుంటున్నారు. అప్పటికీ రాహుల్ గాంధీ మనసు మారితే.. తిరిగి పగ్గాలు అప్పగించొచ్చు అనే యోచనలో ఉన్నారట. లేదంటే తమ పార్టీ అధికారం చేపడితే.. సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అంతా సోనియా వీర విధేయులే ఉన్నందున.. రాహుల్‌కు వచ్చిన ముప్పేమి లేదని అంటున్నారు.

తిరుగుబావుట
కానీ కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు. కొన్ని పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్లు.. అగ్ర నాయకత్వంపై ధిక్కారం వినిపిస్తున్నారు. దీంతో పార్టీలో మిగతా వారికి అవకాశం దక్కుతుంది. అందుకే సోనియా.. ముందు జాగ్రత్త చర్యగా అధ్యక్షుడని మార్చాలని అనుకుంటున్నారు. ఒకవేళ పదవీ నుంచి తప్పించాలని అనుకున్న గెహ్లట్ లాంటి నేత అయితే వెంటనే రిజైన్ చేస్తారని సోనియా భావన అని తెలుస్తోంది.