మా ప్రభుత్వంలో మా కార్యకర్తలకే భద్రత లేదు. సిగ్గుగా ఉంది, ఎన్ఐఏ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్ !
బెంగళూరు/ శివమొగ్గ: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం అట్టుడికిపోతోంది. భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. హర్షా హత్య కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో మా కార్యకర్తలు దారుణ హత్యకు గురికావడంతో మేము సిగ్గుతో తల దించుకుంటున్నామని బీజేపీ ఎంపీ అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు కాపాడలేని మేము ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తామని, మేము చెప్పినప్పుడే రాష్ట్రంలో ఎస్ డీపీఐ సంస్థను నిషేధించి ఉంటే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురై ఉండేవాడు కాదని, ఇది మేము చేసిన తప్పే అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద ఆరోపణలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

హత్య కేసులో ఎవరెవరు ఉన్నారు ?
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం అట్టుడికిపోతోంది. భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. హర్షా హత్య కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. శివమొగ్గతో పాటు కర్ణాటకలో రెండు మూడు రోజులు మనం అప్రమత్తంగా ఉండాలని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాకే సిగ్గుగా ఉంది
మా ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మా కార్యకర్తలు దారుణ హత్యకు గురికావడంతో మేము సిగ్గుతో తల దించుకుంటున్నామని మైసూరు-కొడుకు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సొంత పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ
సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు కాపాడలేని మేము ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తామని, మేము చెప్పినప్పుడే రాష్ట్రంలో ఎస్ డీపీఐ సంస్థను నిషేధించి ఉంటే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురై ఉండేవాడు కాదని, ఇది మేము చేసిన తప్పే అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద ఆరోపణలు చేశారు.

ఎన్ఐఏ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్
శివమొగ్గలో హత్యకు గురైన భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలను కాపాడుకోవడం మా బాధ్యత అని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా ప్రభుత్వం చూసుకోవాలని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే అన్నారు.

సినిమా చూపించిన కార్యకర్తలు
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం రణరంగంగా మారిపోయింది. వేలాది మంది ఒకేసారి ఊరేగింపుగా బయలుదేరడంతో పలువురు సహనం కోల్పోయి ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఓ వర్గానికి చెందిన వారి షాపులు ఆస్తులు ధ్వంసం చేశారు. కార్లకు నిప్పంటించారు. తోపుడు బండ్లకు నిప్పంటించారు కాల్చి బూడిద చేశారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పోలీసుల మీద రాళ్ల వర్షం కురించారు. పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications