• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ జ్యోతి కథ: యాచిస్తూ జీవనం.. చదివి మేనేజర్ కొలువు, సగం జీతం, ఆదర్శం

|
Google Oneindia TeluguNews

ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఊహించలేం.. అంచనా కూడా వేయలేం. అవును మట్టిలో మాణిక్యాలు అని విన్నాం.. చదివాం. కూడా అవును అలాంటి వారికే కసి ఉంటుంది. చదవాలి.. లేదంటే ఏదైనా సాధించాలని గట్టిగా అనుకుంటారు. ఇంకేముంది వారు తమ తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. బీహర్‌లో ఓ యాచకురాలు.. ఇప్పుడు హోటల్ మేనేజర్‌గా ఎదిగారు. ఇదీ ఓ జ్యోతి కథ.. మీరు చదవండి.

19 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

19 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

బీహార్‌ రాజధాని పాట్నాలో 19 సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగింది. ఓ తల్లి తన బిడ్డను చెత్తకుప్పలో పడేసిపోయింది. పసిగుడ్డు గుక్కపెట్టి ఏడుస్తోంది. భిక్షమెత్తుకుంటున్న కరీదేవికి ఆ పసిపాప ఏడుపులు వినిపించాయి. అటూ ఇటూ చూసి.. గట్టిగా పిలిచింది. ఆ పాప కోసం ఎవరూ రాలేదు. తానే భిక్షమెత్తుకుని పొట్ట నింపుకొంటోంది. ఇక పాపనేం పోషిస్తుంది? కానీ, ఆమె మనసు మాత్రం స్థిరంగా ఉండనీయలేదు. ఆ పసిపాపను అక్కున చేర్చుకుంది. ఆ బిడ్డకు జ్యోతి అని పేరు పెట్టింది.

 యాచించి..

యాచించి..


ఆమె అడుక్కుని కడుపునింపింది. వీధుల్లోనే పెంచి పెద్దచేసింది. ఆమెతో కలిసి భిక్షమెత్తుకుంటూ, చెత్త సేకరిస్తూ జ్యోతి పెద్దదైంది. పన్నెండేళ్లు వచ్చేసరికి.. అనారోగ్యంతో కరీదేవి మరణించింది. జ్యోతిని 'రాంబో హోమ్‌ ఫౌండేషన్‌' అనే సంస్థ చెంతన చేర్చుకుంది. ఫౌండేషన్‌ నిర్వాహకులు జ్యోతికి చదువు చెప్పించారు. పదో తరగతి పరీక్షలు రాయించారు. మంచి మార్కులతో పాసైంది. పాట్నాలో ఒక ఆఫీస్‌లో పనికి చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తూనే మార్కెటింగ్‌ కోర్సు చేసింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆర్నెల్లు సేల్స్‌గర్ల్‌గా పని చేసింది. ఇప్పుడు ఆమెకు 19 ఏళ్లు.. సో ఆమె ప్రతిభ బయటకు వచ్చింది.

 పిలిచి మరీ కొలువు

పిలిచి మరీ కొలువు


జ్యోతి ప్రతిభ తెలుసుకున్న 'లెమన్‌ కేఫ్‌'అనే రెస్టారెంట్‌ యాజమాన్యం మంచి అవకాశం ఇచ్చింది. మేనేజర్‌గా కొలువు ఇచ్చి, ఆమె ప్రతిభకు తగిన ఛాన్స్ ఉంది. అలా జ్యోతి మంచి హోదాలో జాబ్ చేస్తున్నారు. అయితే తాను పెరిగిన ఫౌండేషన్‌ను మర్చిపోలేదు. తన సంపాదనలో సగం డబ్బును 'రాంబో హోం ఫౌండేషన్‌'కు విరాళంగా ఇస్తోంది. తాను ఎక్కడినుంచి వచ్చిందో మరచిపోలేదు. తనలాంటి వారికి అవీ మేలు చేస్తాయని భావించి.. సగం జీతం ఇస్తోంది.

మారిన జ్యోతి తలరాత

మారిన జ్యోతి తలరాత


పాట్నా జంక్షన్‌లో భిక్షమెత్తుకున్న జ్యోతి చదువుతో తన జీవితాన్ని మార్చుకుంది. ఆమె లైఫ్ స్టైలే మారిపోయింది. అక్షరాల ఆసరాతో తలరాతను తిరగరాసుకుంది. మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సో.. అభాగ్యులం అని.. ఏమీ లేదని అనుకొకండి. మీకు తగిన సమయం, సందర్భం వస్తాయి.. వచ్చాయో.. ఇక అంతే.. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.

English summary
beggar jyoti life changed. 12 years after her started education. than she comes to a hotel manager
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X