• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్‌లో బెంగళూరు రేప్ విక్టిం: ఫ్రెండ్ చెప్తే విన్లేదు! వ్యాన్లో కన్నడ సాంగ్స్

By Srinivas
|

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో కాల్ సెంటర్ ఉద్యోగిని పైన ముగ్గురు యువకులు వ్యాన్‌లో తిప్పుతూ రెండు గంటల పాటు అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. ఆమె పని చేసే కంపెనీకి రవాణా వ్యవస్థ ఉండి ఉంటే ఇది ఇది తప్పేదని చెబుతున్నారు.

ఆమె పని చేసేది ఓ చిన్న స్థాయి బిపివో సంస్థ అని చెబుతున్నారు. ఆమె పని చేసే కంపెనీకి ఎలాంటి రవాణా వ్యవస్థ లేదు. ఆమె సొంతగానే ఇంటికి వెళ్ల వలసి ఉంటుందని సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిణి కొటక్ చెప్పారు.

కంపెనీలు విధులు ముగించుకున్నాక బాధితురాలు మరో సహోద్యోగిణితో (స్నేహితురాలు కూడా) కలిసి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షా కోసం చూశారు. అంతలోనే, వ్యాన్ వచ్చి ఆగింది. మేం మడివాలా (బాధితురాలు ఉండే ప్రాంతం) దింపుతామని వ్యాన్లో ఉన్న నిందితులు చెప్పారు.

ఎంతకూ ఆటోలు కనిపించక పోవడం, వ్యాన్ రావడం.. అయినప్పటికీ ఆటోలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితురాలు వ్యాన్ ఎక్కారు. అయితే, ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలు.. వ్యాన్ లోపల ఎవరూ లేకపోవడం చూసి, బాధితురాలి ఆపే ప్రయత్నం చేశారు.

వ్యాన్‌లో ప్రయాణీకులు ఎవరూ లేరని స్నేహితురాలు చెప్పి ఆమెను ఎక్కకుండా చేయాలని చూసిందని, కానీ బాధితురాలు ఇంటికి వెళ్లే ఉద్దేశ్యంతో ఆ వ్యాన్ ఎక్కిందని పోలీసులు చెప్పారు.

 Bengaluru BPO rape case: Police detain three people

గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు

వ్యాన్ డ్రైవర్ తాను దిగవలసిన మాడివాలా ప్రాంతంలో ఆపలేదని, ఎవరూ లేని ప్రాంతంలో తిప్పారని, చాలా ప్రాంతాలు తాను గుర్తించలేనని బాధితురాలు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కన్నడ పాటలు పెట్టిన డ్రైవర్

వ్యాన్‌ను ఎవరూ లేని ప్రదేశంలో తిప్పిన డ్రైవర్ అంతసేపు కన్నడ పాటలు పెట్టాడని బాధితురాలు చెప్పారని తెలుస్తోంది. తనను మూడు గంటల పాటు తిప్పారని చెప్పారు. వారు కన్నడలో మాట్లాడుకున్నారని పోలీసులకు చెప్పారు.

సిసిటీవీ ఫుటేజీల పరిశీలన

పోలీసులు ఆయా ట్రాఫిక్ ప్రాంతాల్లో ఉన్న సిసిటివి పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దర్ని అరెస్టు చేశారు. మరోవైపు, ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

షాక్‌కు గురైన బాధితురాలు

బాధితురాలిని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. బాధితురాలు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఆసుపత్రికి వచ్చిందని, పరీక్షలు నిర్వహించామని, ఆమెను డిశ్చార్జ్ చేశామని, ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు సంరక్షణలో ఉన్నారు. విషయం తెలియగానే గ్వాలియర్ నుంచి తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. షాకింగ్‌లో ఉందని, కౌన్సెలింగ్ అవసరమని తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The victim of gang rape might have escaped her ordeal if the company she was working for had provided transport facilities to commute home. But it was not to be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more