బెంగళూరు ఐఐఎస్ సీ క్యాంపస్ లో విద్యార్థినిపై లైంగిక దాడి: చివరికి కామాంధుడు !
బెంగళూరు: దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న బెంగళూరులోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్ సీ) క్యాంపస్ లో విద్యార్థిని మీద లైంగిక దాడి జరగడంతో సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు
ఐఐఎస్ సీలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న గౌతమ్ రాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత గురువారం మద్యాహ్నం 12.30 గంటల సమయంలో 22 ఏళ్ల ఐఐఎస్ సీ విద్యార్థిని క్యాంపస్ లోని లైబ్రరీకి వెళ్లారు.

లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్న విద్యార్థినిని గౌతమ్ రాజ్ బయటకు రావాలని చెప్పాడు. లైబ్రరీ సమీపంలోని చీకటి గది తలుపు తీసి లోపలికి రావాలని అన్నాడు. లోపలికి వెళ్లిన విద్యార్థిని చీకటిగా ఉందని, లైట్ ఆన్ చెయ్యాలని సూచించింది.
ఆ సమయంలో ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకున్న గౌతమ్ రాజ్ ఆమె శరీరాన్ని నిలిపేస్తూ లిప్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆందోళన చెందిన విద్యార్థిని గౌతమ్ రాజ్ నుంచి తప్పించుకుని పారిపోయి ఐఐఎస్ సీ పరిపాలనా విభాగం అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఐఐఎష్ సీ పరిపాలన విభాగం అధికారులు విచారణ చేసి గౌతమ్ రాజ్ నేరం చేశాడని గుర్తించి అతన్ని విధుల నుంచి తప్పించి సదాశినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం గౌతమ్ రాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!