30 ఏళ్ల తర్వాత రంజుగా త్రిపుర రాజకీయం: సీపీఎంకు బీజేపీ సవాల్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీజేపీ.. అటు లెఫ్ట్‌ఫ్రంట్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కమలనాథులు గతంలో కాంగ్రెస్ పార్టీకి గల సంప్రదాయ పునాదిని తమవైపునకు తిప్పుకోవడంపైనే ద్రుష్టి సారించారు. త్రిపుర శాసనసభకు ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాథులు కలలు గంటున్నారు. దీంతో 1988లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికల్లో జోరుజోరుగా ప్రచారం సాగుతోంది.
1988లో కాంగ్రెస్ పార్టీ నాటి త్రిపుర ఉపజాతి జుబా సమితితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 37.33 శాతం ఓట్లతో సంకీర్ణ ప్రభుత్వంలో చేరి పోయింది. సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ 45.82 శాతం అధికారానికి దూరమై విపక్షంలో మిగిలింది.

 లెఫ్ట్ ఫ్రంట్ వ్యతిరేక ఓటు బ్యాంకు క్రమంగా సంఘటితం

లెఫ్ట్ ఫ్రంట్ వ్యతిరేక ఓటు బ్యాంకు క్రమంగా సంఘటితం

2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు 36.38 శాతం ఓట్లతో కేవలం 10 స్థానాల్లో గెలుపొందింది. మిగతా సీట్లన్నీ లెఫ్ట్ ఫ్రంట్ గెలుపొంది అధికారాన్ని చేపట్టింది. గతవారం త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ రోజురోజుకు త్రిపురలో తమ పునాదిని విస్తరిస్తున్నామన్నారు. వామపక్షేతర భావజాలాన్ని తాము ఆక్రమించుకుంటున్నామని జైట్లీ చెప్పారు. లెఫ్ట్ వ్యతిరేక శక్తులను పూర్తిగా తమవైపుకు తిప్పుకున్నామని తెలిపారు.
బీజేపీ త్రిపుర అధికార ప్రతినిధి మ్రునాల్ కాంతిదేవ్ మాట్లాడుతూ ‘మేం ఇప్పటికే లెఫ్ట్ ఫ్రంట్ ఓటుబ్యాంక్‌పై కొంత ఒత్తిడి పెంచాం. గణనీయ స్థాయిలో అసంత్రుప్తిగా ఉన్న ప్రభుత్వోద్యోగులు, వారి డిపెండెంట్లు పాతకాలం నాటి వేతనాలతో మా వైపు తిరిగారు. గిరిజనులంతా ఇప్పటివరకు కమ్యూనిస్టులకు మూలస్థంభాల వంటి వారు' అని చెప్పారు.

ఐక్యతను కోరుతూనే ఐపీఎఫ్టీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ

ఐక్యతను కోరుతూనే ఐపీఎఫ్టీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ

త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు 20 స్థానాలు గిరిజన స్వతంత్ర మండలి పరిధిలోకి వస్తాయి. గిరిజన స్వయం ప్రతిపత్తి మండలి పరిధిలోని ప్రాంతాలన్నీ ఇప్పటికి కమ్యూనిస్టులకు కంచుకోట. ఈ క్రమంలో బీజేపీ త్రిపురలో అధికారంలోకి వచ్చేందుకు ఇండోజెనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)తో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఐపీఎఫ్టీ ప్రత్యేకంగా గిరిజన రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతోంది. కానీ బీజేపీ మాత్రం త్రిపుర ఉమ్మడిగానే ఉండాలని ఆకాంక్షిస్తోంది.

తిరిగి ప్రభుత్వ ఏర్పాటుపై సీపీఎం విశ్వాసం ఇలా

తిరిగి ప్రభుత్వ ఏర్పాటుపై సీపీఎం విశ్వాసం ఇలా

50 స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులంతా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినవారే. ఇక దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే చారిలాం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి ఓటమి పాలు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ 60 అసెంబ్లీ స్థానాల్లో 31 గెలుచుకోవాలంటే 2013లో పొందిన 1.87 శాతం ఓట్ల నుంచి భారీగా ఓట్లు పొందాల్సి ఉంటుంది. సీపీఎం త్రిపుర రాష్ట్ర శాఖ కార్యదర్శి బిజన్ ధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మాకు అంకితమైన కార్యకర్తల మనస్సులు గెలుచుకోవడం చాలా తేలిక. ప్రజల మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు.

ఇలా త్రిపురలో కాంగ్రెస్ పునాది పతనం

ఇలా త్రిపురలో కాంగ్రెస్ పునాది పతనం

త్రిపుర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రద్యోత్ కిశోర్ మాణిక్య మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్షేతర పార్టీలకు చోటు ఉన్నది' అని చెప్పారు. 2008లో గెలుచుకున్న 10 స్థానాలనే కాంగ్రెస్ పార్టీ 2013 ఎన్నికల్లోనూ నిలబెట్టు కున్నది. కానీ 2013 తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇతర పార్టీల్లోకి త్రుణమూల్ కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయారు. ఆయా ఎమ్మెల్యేలు, నేతలకు గల క్యాడర్ కూడా ఇతర పార్టీల్లోకి షిప్ట్ అయ్యారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45.75 శాతం ఓటు బ్యాంకు ఉంటే బీజేపీకి కేవలం 1.87 శాతం లభించింది. ఏళ్ల తరబడి బద్ధ శత్రువులుగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ శాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గల ప్రధాన నేతలంతా త్రుణమూల్ కాంగ్రెస్ బాట పట్టారు. దాదాపుగా కాంగ్రెస్ పునాది పడిపోయింది.

త్రిపురలో క్రమంగా పెరిగిన బీజేపీ ప్రజాదరణ

త్రిపురలో క్రమంగా పెరిగిన బీజేపీ ప్రజాదరణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుదీప్ రాయ్ బర్మన్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. లెఫ్ట్ వ్యతిరేక ఓటులో చీలిక తేకూడదని భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బీజేపీకి మద్దతుగా ఓటేస్తామని చెబుతున్నారు. లెఫ్ట్ వ్యతిరేక ఓటుపైనే బీజేపీ చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ 60 అసెంబ్లీ స్థానాలకు గానూ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నా.. తిరిగి బలం పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీ దాని మిత్రపక్షం ఇండోనెజియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)కి, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య ముఖాముఖీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. రోజురోజుకు బీజేపీ ప్రజాదరణ క్రమంగా పెరిగిందనడంలో సందేహం లేదని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లంతా విభిన్నంగా ఓట్లేస్తున్నారు.

స్వల్ప పునాదితోనే అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో గెలిచామన్న అమిత్ షా

స్వల్ప పునాదితోనే అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో గెలిచామన్న అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తూ లెఫ్ట్‌యేతర ఓటర్లను చీలుస్తున్నదని ఆరోపించారు. అయినా త్రిపురలో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అసోం, మణిపూర్‌ రాష్ట్రాల్లో స్వల్పంగా పునాది కలిగి ఉన్న తాము అధికారంలోకి వచ్చామని అమిత్ షా పేర్కొన్నారు. త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రవేశమే లేదని పుదుచ్ఛేరి సీఎం వీ నారాయణ స్వామి తెలిపారు. సీపీఎం అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడగలదని స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the BJP trying hard to come to power in Tripura, campaigning for the February 18 Assembly election in the State has been intense. The last time such intense electioneering took place was in 1988, when the Congress formed a coalition government with the Tripura Upajati Juba Samiti.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X