వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక హర్యానా వంతు.. రైతులపైకి దూసుకొచ్చిన ఎంపీ కారు, ఒకరికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ లఖిమ్‌పూర్ ఘటన హీటెక్కిస్తోంది. సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపై కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. వారిపై నుంచి బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది. యూపీలో మంత్రి కాన్వాయ్ వెళ్లగా.. ఇక్కడ ఎంపీ కారు వెళ్లింది. హర్యానా ఘటనలో ఓ రైతు గాయపడ్డాడు.

ఎంపీ కారు..

ఎంపీ కారు..

హర్యానా అంబాలా సిటీకి సమీపంలోని నారైంగర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా కలకలం రేసిన లఖింపూర్ ఘటన జరిగిన నాలగు రోజుల్లోనే ఇప్పుడు హర్యానాలో రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లడం గమనార్హం. కురుక్షేత్ర ఎంపీ నయాబ్ సైనీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర బీజేపీ నేతలు నారైంగర్‌లోని సైని భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.

బీజేపీ నాయకుల పర్యటనకు నిరసనగా సైని భవన్ బయట పెద్ద సమూహం వచ్చి చేరింది. నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ రైతులు సైని భవన్ బయట నిరసన చేపట్టారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత బీజేపీ నేతల కార్ల కాన్వాయ్ ఆ ప్రాంతం నుంచి వెళ్లే సమయంలో ఒక వాహనం రైతును ఢీకొట్టింది. రైతుని ఢీకొట్టిన కారు బీజేపీ ఎంపీ నయాబ్ సైనీదేనని రైతులు ఆరోపించారు. గాయపడిన రైతుని నారైంగర్‌ హాస్పిటల్‌కు తరలించారు.

నేను లేనే..

నేను లేనే..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లాలోని టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ ఘర్షణ చెలరేగింది. మంత్రుల కాన్వాయ్‌లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లడంతో నలుగురు రైతులు చనిపోయారు.

ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమేనని ఆశిష్ మిశ్రా తెలిపారు

సుప్రీంకోర్టు ఆరా

సుప్రీంకోర్టు ఆరా

ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 9 మంది వరకు చనిపోయారు. లఖింపూర్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఘటనకు కారణమైన వారిని ఎంత మందిని గుర్తించారు? ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ కావాలని ధర్మాసనం ఆదేశించింది. నలుగురు రైతులు సహా ఎనిమిది చనిపోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సుప్రీం ఆరా తీసింది.

 కుదిపేసిన ఇష్యూ

కుదిపేసిన ఇష్యూ


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును నడపడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం ఘటన జరగగా.. యూపీనే కాకుండా మొత్తం దేశాన్ని కుదిపివేసింది. కేంద్ర మంత్రిపై అతడి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Farmers in Haryana have said one person was injured after a vehicle in a convoy carrying BJP MP Nayab Saini hit people protesting against the centre's farm laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X