వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందమందితో బిఎస్ పి అభ్యర్థుల జాబితా, 34 మంది ముస్లింలకు చోటు

బిఎస్ పి అధినేత్రి మాయావతి వందమందితో తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 34 మంది ముస్లింలున్నారు. ఇంకా మిగిలిన ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బిఎస్ పి విడుల చేసింది. వందమందితో బిఎస్ పి తన తొలిజాబితాను ప్రకటించింది.ఇందులో 34 మంది ముస్లింలకు బిఎస్ పి టిక్కెట్టును కేటాయించింది.మిగిలిన పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ములాయం, అఖిలేష్ యాదవ్ లు వేర్వేరుగా ఉన్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ కి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుండి మార్చి 8వ, తేది వరకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బిఎస్ పి ఇవాళ ప్రకటించింది.
గత ఏడాది డిసెంబర్ మాసంలోనే సమాజ్ వాదీ పార్టీ 375 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ ఈ జాబితాను ప్రకటించారు.అయితే ఈ జాబితాకు పోటీగా అఖిలేష్ యాదవ సుమారు 235 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాడు.

కాంగ్రెస్ పార్టీ , సమాజ్ వాదీ పార్టీల మద్య పొత్తు ఉండాలని రెండు పార్టీలకు చెందిన నాయకులు కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రనాయకులు వ్యతిరేకిస్తున్నారు.

బిఎస్ పి తొలి జాబితా

బిఎస్ పి తొలి జాబితా

ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బిఎస్ పి వందమందితో తన జాబితాను ప్రకటించింది.34 మంది ముస్లిం అభ్యర్థులకు బిఎస్ పి టిక్కెట్లను కేటాయించింది .మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడ త్వరలోనే వెల్లడించనున్నట్టు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించింది.అయితే ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే పార్టీలో నెలకొన్న సమస్యలతో ములాయం, అఖిలేష్ లు పోటాపోటీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో ఏ జాబితా ఫైనల్ అవుతోందో అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తండ్రీ కొడుకుల మద్య రాజీ కుదురుతోందా లేదా అనే దానిపై ఆదారపడి అభ్యర్థుల జాబితాల భవితవ్యం ఉంటుంది.

బిజెపి అభ్యర్థుల జాబితా

బిజెపి అభ్యర్థుల జాబితా

ఉత్తర్ ప్రదేశ్ రాస్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను బిజెపి వ్యూహరచన చేస్తోంది.అయితే బ్రహ్మణసామాజికవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. ఈ మేరకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. అయితే త్వరలోనే ఆ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే బిజెపి తన అభ్యర్థుల జాబితాను తయారు చేసింది.అయితే త్వరలోనే బిజెపి తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం లేకపోలేదు.

 డిల్లీ వెళ్ళిన ములాయం సింగ్ యాదవ్

డిల్లీ వెళ్ళిన ములాయం సింగ్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ వెళ్ళాడు. తన సోదరుడు శివపాల్ యాదవ్ నుతీసుకొని ఆయన డిల్లీకి చేరుకొన్నాడు. ఎన్నికల కమీషన్ జనవరి 9వ, తేది లోపుగా తమకు మద్దతిచ్చేవారితో అఫిడవిట్లను ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ములాయం సింగ్ ఢిల్లీ వెళ్ళినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే ములాయం సింగ్ యాదవ్ కు 30 మంది సిట్టింగ్ ఎంఏల్ఏలు మాత్రమే మద్దతిస్తున్నారు.అయితే చివరి వరకు వారు ములాయంతోనే ఉంటారా లేదా అనేది కూడ అనుమానమేననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

మద్దతుదారులతో అఖిలేష్ అఫిడవిట్లు

మద్దతుదారులతో అఖిలేష్ అఫిడవిట్లు

ఎన్నికల కమీషన్ నుండి నోటీసులు అందడంతో తనకు మద్దతిచ్చేవారితో అఖిలేష్ యాదవ్ అఫిడవిట్లు సమర్పించే పనిలో ఉన్నాడు. ఈ మేరకు తన మద్దతుదారులతో ఆయన అఖిలేష్ యాదవ్ అఫిడవిట్లను తీసుకొంటున్నాడు. శుక్రవారంనాడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల కమీషన్ వద్దకు వెళ్ళి తన మద్దతుదారుల నుండి తీసుకొన్న అఫిడవిట్లను సమర్పించనున్నాడు

English summary
bsp released its first list of hundred canddidates for the uttar pradesh assembly elections.tjis list includes 34 muslim candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X