వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, సెరవాక్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే

|
Google Oneindia TeluguNews

సీరం ఇనిస్టిట్యూట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గర్భాశయ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్‌కు సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామిని తెలిపంది. సెరావాక్ అనే వ్యాక్సిన్ ఇస్తామని.. దీని ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉంటుందని తెలిపింది. తొలుత ప్రభుత్వమే ఈ వ్యాక్సిన్ అందజేస్తోంది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు భాగస్వాములు అయ్యేందుకు వెసులుబాటు ఉంది. ఈ మేరకు సీరమ్ ఇండియా సీఈవో అదార్ పూనావాల తెలిపారు. వయస్సును బట్టి టీకా.. రెండు లేదంటే మూడు డోసులు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

 అవీ ధర ఎక్కువే

అవీ ధర ఎక్కువే

ఇప్పుడు దేశంలో సర్వైకల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.. కానీ అవీ విదేశీ కంపెనీలకు చెందినవి.. గర్డాసిల్.. సెర్వారిక్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అవీ ఒక్కో డోసు రూ.2 వేల నుంచి రూ.3500 వరకు తీసుకుంటున్నాయి. దీంతో తక్కువ ధరలో సీరం ఇనిస్టిట్యూట్ టీకాను తీసుకొచ్చింది.

టీకాను డెవలప్ చేయడానికి దశాబ్దం దాటింది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 2 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగంతో కలిసి సీరం.. టీకాను డెవలప్ చేసింది. టీకా ప్రక్రియను 2011 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. అప్పుడు భారత డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది.

ప్రికాషన్స్ తప్పనిసరి

ప్రికాషన్స్ తప్పనిసరి

వ్యాక్సిన్ తయారీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేశారని.. అదీ మంచి పరిణామం అని బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేశ్ గోఖలే తెలిపారు. కరోనా వైరస్ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అయ్యిందని గుర్తుచేశారు. సెరవాక్ యాంటీబాడీలను ప్రతిస్పందిస్తోందని.. మిగతా వ్యాక్సిన్ల కంటే చక్కగా పనిచేస్తోంది. హెచ్‌పీవీ 16, 18, 31, 33, 45, 52, 58 క్యాన్సర్ అధిక ప్రమాదంగా పరిగణించబడతాయి. 6, 11 రకం తక్కువ ప్రమాద రకాలు అని.. సీరం టీకా 6, 11, 16, 18కి వ్యతిరేకంగా పనిచేయనుంది. అంటే నాలుగు వివిధ రకాల నుంచి రక్షిస్తోంది. 90 శాతం హెచ్‌పీవీని కవరేజీ ఇస్తోంది.

5 శాతం మంది మహిళలు..

5 శాతం మంది మహిళలు..

దేశంలో మహిళలకు తరచుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తోంది. 5 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హెచ్‌పీవీ 16, 18 సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు. 83.2 శాతం మంది సర్వైకల్ క్యాన్సర్‌లో గల 16, లేదా 18 సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో 15 ఏళ్లు పైబడిన వారు.. 483.5 మిలియన్ల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఏటా లక్ష 23 వుల 907 మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. 77 వేల 348 మంది చనిపోతున్నారు. తరచుగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండోవదని చెబుతున్నారు.

ఎవరెవరు తీసుకోవాలంటే..

ఎవరెవరు తీసుకోవాలంటే..

9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు రెండు డోసుల వ్యాక్సిన్.. 15 నుంచి 26 ఏళ్ల వయస్సు ఉన్న వారు 3 డోసులు తీసుకోవాలని చెబుతున్నారు. సో.. గర్భాశయ క్యాన్సర్‌ను టీకా తీసుకొని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. సమస్యను ముందే గుర్తించి.. జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంతైనా ఉంది.

English summary
Ceravac, an indigenously developed vaccine for cervical cancer caused by the human-papillomavirus, will be priced between Rs 200-400 per dose and available in a few months Serum Institute of India said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X