యుద్దానికి కౌంట్‌డౌన్: ఇండియాపై చైనా మీడియా కథనం, సమర్థించిన అధికారి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి ఇండియాపై రెచ్చగొట్టేలా వ్యవహరించింది. శాంతి, సమన్వయంతో ముందుకువెళ్ళాలనుకొనే దశలో చైనా మీడియా మరోసారి రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతోంది.

ఇక భారత్‌తో యుద్దానికి కౌంట్‌డౌన్ మొదలైందని చైనా మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రసారం చేసింది.

China Media And Official Both Issue Strong Warnings On War With India

ఈ కథనాన్ని బలపర్చేలా ఓ ఉన్నతాధికారి కూడ మాట్లాడారు. ఢిల్లీ చేస్తున్న చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కాశ్మీర్‌లోకి అడుగుపెట్టేలా చేస్తున్నాయంటూ ఆ పత్రిక కథనాలను రాసింది.

డోక్లామ్ సమస్యలకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతోందన్న ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. సమరానికి సమయం దగ్గరపడిందని, శాంతి ద్వారాలు మూసుకుపోయాయని చైనా మీడియా ప్రకటించింది.భారత్ పూర్తి బాధ్యత వహించాలంటూ చైనా అధికారిక పత్రిక కథనం ప్రసారం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The countdown to a military conflict between India and China has begun, a Chinese daily claimed today, while a senior government official in Beijing baited India by suggesting Delhi's actions could be matched by Chinese soldiers entering Uttarakhand or Kashmir.
Please Wait while comments are loading...