క్రిస్మస్.. కేకులకు ఎందుకంత క్రేజీ ! వీడియో!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Christmas Cakes : క్రిస్మస్.. కేకులా మజాకా ! వీడియో !

  డిసెంబర్ వస్తూనే క్రిస్మస్ వచ్చేస్తోందనే శుభవార్తను కూడా మోసుకొచ్చింది. క్రిస్మస్ అంటేనే ఆనందాల పండుగ. ఏసుక్రీస్తు భూమిపై మానవుడిగా జన్మించిన శుభదినం. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నాపెద్ద తేడా లేకుండా క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఆ కేకు కోస్తే కానీ క్రిస్మస్ జరిపినట్లు కాదనే భావన దాదాపు అందరు క్రిస్టియన్లలో ఉంటుంది. అలాంటి కేకు రుచి మామూలు కేకులకు భిన్నంగా అద్భుతంగా ఉంటుంది. క్రిస్మస్ కేకు తయారుచేయడం కూడా ఒక ప్రసిద్ధి చెందిన సాంప్రదాయంగా శతాబ్దాల నుండి కొనసాగుతోంది.

  క్రిస్మస్ సాధారణంగా అర్ధరాత్రి మాస్ గా ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు అర్ధరాత్రి సమయంలో పుట్టారంటారు.. కాబట్టి కిస్మస్ ప్రతి చర్చిలోను మిడ్ నైట్ మాస్ గా జరుగుతుంది. క్రిస్మస్ వస్తోందనగానే మనలో చాలామంది ఇళ్ళను ముందే అలంకరించుకోవటంలో బిజీగా ఉంటారు. క్రిస్టియన్లకి పెద్దరోజైన క్రిస్మస్ మొదలయ్యే నెల ముందు నుంచే ఈ హడావిడి మొదలవుతుంది. అలంకరణలో భాగంగానే నక్షత్రాలు, క్రిస్మస్ చెట్టు, బహుమతులు, ఇంకా ఇలాంటివి చాలానే తయారవుతూ ఉంటాయి.

  Christmas celebrations around the world

  క్రిస్‌మస్ ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం. క్రిస్‌మస్ రోజున బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్‌మస్‌ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖసంతోషాలను తెస్తుందని నమ్ముతారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Christmas celebrations around the world. Christmas Cakes and Christmas cake decorations.డిసెంబర్ వస్తూనే క్రిస్మస్ వచ్చేస్తోందనే శుభవార్తను కూడా మోసుకొచ్చింది. క్రిస్మస్ అంటేనే ఆనందాల పండుగ. ఏసుక్రీస్తు భూమిపై మానవుడిగా జన్మించిన శుభదినం. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నాపెద్ద తేడా లేకుండా క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఆ కేకు కోస్తే కానీ క్రిస్మస్ జరిపినట్లు కాదనే భావన దాదాపు అందరు క్రిస్టియన్లలో ఉంటుంది. అలాంటి కేకు రుచి మామూలు కేకులకు భిన్నంగా అద్భుతంగా ఉంటుంది.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి