వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Civil Services 2020 Results:తుది ఫలితాలు విడుదల.. టాపర్ ఎవరంటే..?

|
Google Oneindia TeluguNews

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2020కి సంబంధించి తుది ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 761 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులుగా నిలిచారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS),ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS),ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), మరియు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ మరియు గ్రూప్ బీలకు నియమించబడతారు.

ఇక సివిల్ సర్వీసెస్ -2020కి సంబంధించి గతేడాది అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ పరీక్ష జరగగా దాని ఫలితాలు అదే ఏడాది అక్టోబర్ 23వ తేదీన విడుదలయ్యాయి. ఇక 2021 జనవరి 8వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ ఏడాది మే 23వ తేదీన వచ్చాయి. ఇక మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఫలితాలు వచ్చే నెల వస్తాయని అంతా భావించినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ యూపీఎస్సీ సెప్టెంబర్ 24వ తేదీనే ఫలితాలను విడుదల చేసింది.

UPSC have released the civil services-2020 final results on 24th september 2021.

ఇక ఫలితాలను పరిశీలిస్తే శుభం కుమార్‌ ఫస్ట్ ర్యాంకును సాధించారు. ఈ అభ్యర్థి ఐఐటీ బాంబే నుంచి సివిల్ ఇంజినీరింగ్‌ చేశాడు. ఇక మహిళల్లో జాగ్రతి అవాస్తి రెండవ ర్యాంకు సాధించగా.. మహిళల్లో టాపర్‌గా నిలిచింది.భోపాల్ మానిత్ నుంచి ఆమె ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇక టాప్ 25 అభ్యర్థుల్లో 13 మంది పురుషులు 12 మంది మహిళలు ఉన్నారు. ఇక 25 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ పేర్కొంది.

కేటగిరీల వారీగా చూస్తే 263 మంది జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించగా 86 మంది ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక 229 మంది ఓబీసీ కేటగిరీ, 122 ఎస్సీ కేటగిరీ, 61 మంది ఎస్సీ కేటగిరీకి చెంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించారు. అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in సందర్శించండి

కిందకు నేవిగేట్ చేసి "Final Result" పై క్లిక్ చేయండి

రిజల్ట్ లింక్ కనిపిస్తుంది

అభ్యర్థి రోల్ నెంబర్/పేరుతో సెర్చ్ చేయండి

ఫలితాలు కలిగి ఉన్న పేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

ఇక మొత్తం 927 ఖాళీలను గుర్తించగా 829 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. 66 మంది అభ్యర్థుల రిజల్ట్స్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచగా.. ప్రొవిజినల్ కింద 66 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఉత్తీర్ణులుగా నిలిచిన అభ్యర్థులకు సంబంధించి కటాఫ్ మార్కులు అధికారిక వెబ్‌సైట్‌పై 15 రోజుల్లోగా పొందుపరుస్తారు.

English summary
UPSC have released the civil services-2020 final results on 24th september 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X